బార్సిలోనాలో నయనతార హానీమూన్.. రొమాన్‌లో మునిగి తేలిన విఘ్నేష్ శివన్.. ఫోటోలు వైరల్!
నయనతార ప్రేమ, పెళ్లిళ్ల మీద ఎన్నెన్ని రూమర్లు, కథనాలు వచ్చాయో అందరికీ తెలిసిందే. ఆమె బాయ్ ఫ్రెండ్స్, లవర్స్ మీద లెక్కలేనన్ని ట్రోల్స్, మీమ్స్ వచ్చాయి. శింబు, ప్రభుదేవా వంటి వారితో వ్యవహారం పెళ్లి పీటల వరకు వచ్చింది. కానీ చివరినిమిషంలో అంతా తారుమారైంది. అయినా కూడా ముచ్చటగా మూడోసారి ప్రేమలో పడింది. దర్శకుడు విఘ్నేశ్ శివన్ యాక్షన్ కట్స్ చెబుతూనే నయన్‌ను ప్రేమలోకి దింపేశాడు. అలా ఐదారేళ్లు ఎంచక్కా ఎంజాయ్ చేశారు. చివరకు ఈ ఏడాది మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

నయన్ విఘ్నేశ్ జోడి..
నయన్ విఘ్నేశ్ జోడి మీద ఎన్నెన్నో కథనాలు పుట్టుకొచ్చాయి. ఇద్దరూ విడిపోయారని, వేర్వేరుగా ఉన్నారని, పెళ్లి జరగదని, వారి జాతకంలో ఏదో దోషం ఉందని, అందుకే పరిహారం కోసం గుళ్ల చుట్టూ తిరుగుతున్నారంటూ ఇలా ఎన్నెన్నో రూమర్లు వచ్చాయి. ఈ ఇద్దరూ కలిసి కనిపించకపోతే.. విడిపోయారనే రూమర్లు గుప్పుమనేవి.

గుళ్లో పెళ్లి..
మహాబలిపురంలోని గుళ్లో నయన్ విఘ్నేశ్ వివాహాం జూన్ 9న అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ పెళ్లి నాడు నయన్ విఘ్నేశ్ జంట ఎంతో గొప్ప పని చేసింది. తమిళనాడులోని వృద్దాశ్రమాలు, అనాథాశ్రమాల్లో ఉచితంగా లంచ్‌ను ప్రొవైడ్ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.

తిరుమల వివాదం..
తిరుమలలో చెప్పులతో మాడవీధుల్లో నయన్ నడవటం, స్వామి వారి గుడి ముందే ఫోటో షూట్లు చేయడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చివరకు వివాదం చిలికి చిలికి గాలివానలా మారడంతో విఘ్నేశ్ శివన్ ఓ లేఖ రాశాడు. భక్తులకు క్షమాపణలు చెబుతూ ఓ ప్రెస్ నోట్ వదిలాడు.

హనీమూన్ పిక్స్..
పెళ్లి తరువాత నయన్ విఘ్నేశ్ ఇద్దరూ కూడా మాల్దీవుల్లో సందడి చేశాడు. హనీమూన్ పిక్స్‌ను విఘ్నేశ్ షేర్ చేయగా నెట్టింట్లో తెగ ట్రెండ్ అయ్యాయి. నయన్ ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో కనిపించినా కూడా ఆమె మెడలో విఘ్నేశ్ కట్టిన ఆ పసుపు తాడు మాత్రం కనిపిస్తోంది. దీంతో ఆమె మీద అందరికీ మరింత గౌరవం పెరుగుతోంది.
పసుపుతాడు..
సెలెబ్రిటీలు, స్టార్ హీరోయిన్లు మెడలో తాళి బొట్టును ధరించరు.ఇక పసుపుతాడును ఉంచుకుంటారా? అలా ఎవరైనా ఊహించుకుంటారా? కానీ నయన్ మాత్రం దానికి విలువను గుర్తించి.. మెడలోనే ధరిస్తుంటుంది. ఎక్కడకు వెళ్లినా ఎలాంటి దుస్తులు వేసుకున్నా కూడా తాళి బొట్టును మాత్రం తీయదు. తాజాగా మరోసారి ఆ పసుపు తాడు హైలెట్ అవుతోంది.
బార్సిలోనాలో..
నయన్ విఘ్నేశ్‌లు ప్రస్తుతం బార్సిలోనాలో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక తాజాగా నయన్ ఫోటోలను విఘ్నేశ్ శివన్ పై నుంచి తీశాడు. ఇందులో నయన్ డీప్ క్లీవేజ్ షో కనిపిస్తోంది. దాంతో పాటు ఆమె పసుపుతాడు కూడా కనిపించింది. మొత్తానికి ఇందులో నయన్ మరింత హాట్‌గా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











