న్యూయార్క్ నడివీధుల్లో ప్రేమజంట.. లేడీ సూపర్‌స్టార్‌ కళ్లలోకి చూస్తూ..

సౌత్‌ లేడీ సూపర్ స్టార్‌గా దూసుకుపోతున్న నయనతార పుట్టిన రోజు నేడు (నవంబర్ 18). ఇక ప్రియురాలి పుట్టినరోజు అంటే ఆమె ప్రియుడికి పెద్ద పండగే కదా. అలానే నయన్ పుట్టినరోజును ఆమె ప్రియుడు విఘ్నేశ్ శివన్ గ్రాండ్‌గానే సెలెబ్రేట్ చేసినట్టు కనిపిస్తోంది. సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే నయన్.. ప్రియుడితో గడిపేందుకు మాత్రం పక్కా ప్రణాళిక వేసుకుంటుంది. ప్రస్తుతం ఈ ప్రేమ పక్షులు న్యూయార్క్ సిటీలో విహరిస్తున్నారు.

నయన్ జీవితంలో ప్రేమ ఓ విషాదం..

నయన్ జీవితంలో ప్రేమ ఓ విషాదం..

నయనతార జీవితంలో ప్రేమ అనేది కలిసి రాలేదు. మొదటగా శింబుతో చెడింది.. ఆపై ఇండియన్ మైఖెల్ జాక్సన్ ప్రభుదేవా తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. పెళ్లి పీఠల వరకు వ్యవహారం వచ్చి.. చివరి క్షణంలో బెడిసికొట్టింది. ఆ సంఘటన నుంచి తేరుకోవడానికి సమయం తీసుకున్నా.. తన సినీ కెరీర్‌ను గాడిలో పెట్టింది.

 వరుస ఆఫర్లతో బిజీ..

వరుస ఆఫర్లతో బిజీ..

ప్రభుదేవాతో పెళ్లి అని వార్తలు వచ్చిన సమయంలో సినీ కెరీర్‌కు గుడ్ బై చెప్పనుందని రూమర్లు వినిపించాయి. ఈ విషయంలోనే వీరిద్దరికి గొడవలు జరిగాయని కూడా టాక్. బ్రేకప్ అనంతరం.. వరుస ఆఫర్లతో దూసుకుపోయింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతోనూ సత్తాచాటి సూపర్ స్టార్‌గా స్టార్ డమ్ తెచ్చుకుంది.

ఆ చిత్రంతో ప్రేమ..

నేను రౌడీనే.. అనే చిత్రంతో విఘ్నేశ్ శివన్, నయనతార కలిసి పనిచేయగా.. ఆ సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఇక అప్పటి నుంచి వీరిద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరగసాగారు. అంతేకాకుండా సొంత నిర్మాణ సంస్థను స్థాపించి ప్రియురాలితో సినిమాలను కూడా నిర్మిస్తున్నాడు.

ఎంత బిజీగా ఉన్నా ప్రియుడికి సమయం..

సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ప్రియుడికి మాత్రం సమయాన్ని కేటాయిస్తుంది. సినీ ఫంక్షన్లకు రాని నయన్.. విఘ్నేష్‌తో కలిసి విదేశాలకు చెక్కేస్తూ ఉంటుంది. వీలు దొరికినప్పుడల్లా ఈ ప్రేమ జంట విదేశాల్లో వాలుతుంది. ప్రస్తుతం వీరిద్దరు న్యూయార్క్‌లో ఎంజాయ్ చేస్తున్నారు.

 కళ్లలోకి చూస్తూ.. కవిత్వం..

కళ్లలోకి చూస్తూ.. కవిత్వం..

ప్రియురాలి పుట్టినరోజు కంటే ప్రియుడికి ప్రత్యేకమైన, పెద్ద పండుగ వేరేది ఉండదని అందరికీ తెలిసిందే. న్యూయార్క్ నడివీధుల్లో నయన్‌తో కలిసి నడిస్తూ ఉన్న ఫోటోనే షేర్ చేస్తూ.. ఇది గుర్తుంచుకోవాల్సిన నడక అంటూ పోస్ట్ చేశాడ. మరో పోస్ట్‌లో నయన్ కళ్లలోకి చూస్తూ ఉన్న ఫోటోను షేర్ తనదైన శైలిలో భావాలను పోస్ట్ చేశాడు.

Recommended Video

#CineBox : Sarileru Nekevvaru Teaser Update | Aamir Khan's Lal Singh Chadha First look
విజిల్‌తో సూపర్ హిట్..

విజిల్‌తో సూపర్ హిట్..

కెరీర్ పరంగా హై స్పీడ్‌లో దూసుకుపోతున్న నయన్.. రీసెంట్‌గా విజిల్, సైరా చిత్రాలతో పలకరించింది. విజిల్ తమిళ నాట భారీ హిట్ కొట్టగా.. సైరా తెలుగునాట విజృంభించింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్లతో జోరు మీదున్న నయన్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ దర్భార్ చిత్రంలో నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X