నయనతార జంటపై అపహరణ కేసు.. విఘ్నేష్ బాబాయ్ ఫిర్యాదు.. డీఎస్పీ యాక్షన్
సౌత్ లేడి సూపర్ స్టార్ నయనతార ఆమె భర్త విఘ్నేష్ శివన్ ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. వివాహబంధంతో ఒక్కటైన ఈ జంట అక్టోబర్ 9న ఇద్దరు కవల పిల్లలకు జన్మనివ్వగా.. అది ప్రభుత్వ నిభందనలు పాటించకుండా జరిగిందని ఆరోపణలు వచ్చాయి.
ఆ వివాదం నుంచి బయట పడిన నయన్-విఘ్నేష్ జంటకు తాజాగా మరో చిక్కొచ్చి పడింది. అది బయట వ్యక్తుల నుంచి కాకుండా వారి కుటుంబంలోని మనిషి నుంచి రావడం హాట్ టాపిక్ గా మారింది. విఘ్నేష్ శివన్ బాబాయ్ మాణిక్యం తాజాగా అపహరణ కేసు పెట్టారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

17 ఏళ్లపాటు: కాలేజీ డేస్ నుంచే మోడలింగ్ ప్రారంభించిన మలయాళ కుట్టి నయనతార 'మనస్సినక్కరే' మూవీతో హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసింది. విభిన్నమైన సినిమాల్లో అలరించిన ఈ బ్యూటిఫుల్ సౌత్ లేడి సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది. సుమారుగా 17 ఏళ్ల నుంచి చిత్ర పరిశ్రమలో వెలుగొందుతోన్న నయనతార మాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసుకుంది.

దుమారం: ఇక నయనతార కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. ఇటీవలే ఈ దంపతులకు ఇద్దరు ట్విన్ బేబీ బాయ్స్ జన్మించారు. నయన తార సరోగసీ ద్వారా పిల్లల్ని కనడంపై పెద్ద దుమారం రేగింది. నయన్ తన పిల్లలిద్దరికి ఉయిర్, ఉలగ్ అని పేర్లు పెట్టింది. వారి పిల్లలకు సంబంధించిన ఫొటోలను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులతో పంచుకుంటుంది.
పోలీస్ ఇన్ఫార్మర్: ఇదిలా ఉంటే తాజాగా డైరెక్టర్ విగ్నేష్ శివన్-నయనతార జంటపై ఆస్తి అపహరణ కేసు నమోదు అయింది. విఘ్నేష్ శివన్ పూర్వీకులు తిరుచ్చి జిల్లా లాల్ కుడి గ్రామానికి చెందినవారు. విఘ్నేష్ తండ్రి పేరు శివకొళుందు. వీళ్లు మొత్తంగా తొమ్మిది మంది అన్నదమ్ములు. పోలీస్ ఇన్ఫార్మర్ గా పని చేసిన విఘ్నేష్ శివన్ తండ్రి శివకొళుందు ప్రస్తుతం లేరు.

డీఎస్పీకి ఫిర్యాదు: శివకొళుందు జీవించి ఉన్నప్పుడు తమ ఉమ్మడి ఆస్తిని అన్నదమ్ములకు తెలియకుండా మోసపూరితంగా అపరహించినట్లు ఆయన సోదరుడు మాణిక్యం ఆరోపించారు. అంతేకాకుండా కోయంబత్తూరులో నివసిస్తున్న మరో సోదరుడు కుంచిత పాదం గురువారం తిరిచ్చి డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు కూడా చేశారు. దీంతో తమిళ చిత్ర పరిశ్రమలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

నయనతారపై చర్యలు: సోదరుడు శివకొళుందు తమ ఆస్తిని తమకు తెలియకుండా వేరే వారికి విక్రయించి మోసానికి పాల్పడ్డాడని విఘ్నేష్ బాబాయ్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. తమ ఆస్తిని కొనుగోలు చేసిన వారికి డబ్బును తిరిగి ఇచ్చి.. ఆస్తిని తమకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే.. సోదరుడు కుమారుడు విఘ్నేష్ శివన్, అతని తల్లి మీనా కుమారి, సోదరి ఐశ్వర్య, భార్య నయనతారలపై చర్యలు తీసుకోవాలని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు.

తలనొప్పిగా: విఘ్నేష్ శివన్ బాబాయ్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసును దర్యాప్తు చేయాల్సిందిగా పోలీసులకు తిరుచ్చి డీఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ వ్యవహారం నయనతార జంటకు పెద్ద తలనొప్పిగా మారిందని అంటున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఈ వివాదం నుంచి నయన్ జోడి ఎలా బయటపడతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











