Nayanthara Wedding: పెళ్లిరోజే విఘ్నేష్ పోస్ట్ వైరల్.. నయనతార గురించి ఊహించని విధంగా!

సినీ రంగంలోనే ఎక్కువగా ప్రేమ వ్యవహారాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే, అందులో చాలా తక్కువ మంది మాత్రమే తమ బంధాన్ని పెళ్లి పీటల వరకూ తీసుకు వెళ్తుంటారు. అందులో లేడీ సూపర్ స్టార్ నయనతార.. ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్ జంట ఒకటి. చాలా కాలంగా ప్రేమాయణం సాగిస్తోన్న వీళ్లిద్దరూ... ఎప్పుడో పెళ్లి చేసుకోవాల్సి ఉన్నా.. అనివార్య కారణాల వల్ల దాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జూన్ 9న ఈ జంట అగ్నిసాక్షిగా ఒక్కటి కాబోతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పెళ్లికి కొన్ని గంటల ముందు విఘ్నేష్ చేసి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అందులో ఏముంది? నయన్‌పై అతడు ఎలాంటి కామెంట్లు చేశాడు? అనేవి చూద్దాం పదండి!

విఘ్నేష్‌తో నయన్ ప్రేమాయణం

విఘ్నేష్‌తో నయన్ ప్రేమాయణం

లేడీ సూపర్ స్టార్‌గా నయనతార ఎంత సక్సెస్ అయిందో.. ప్రేమ వ్యవహారాల విషయంలో మాత్రం పలుమార్లు విఫలమైంది. గతంతో పలువురితో ప్రేమాయణం సాగించిన ఈమె.. వాళ్లతో బంధాన్ని మాత్రం పెళ్లి వరకూ తీసుకెళ్లలేదు. ఇలా కొన్ని బ్రేకప్‌ల తర్వాత నయన్.. విఘ్నేష్ శివన్ అనే కోలీవుడ్ డైరెక్టర్‌తో లవ్ ట్రాకును మొదలెట్టి.. నాలుగేళ్లుగా అతడితో డేటింగ్ చేస్తోంది.

ఎట్టకేలకు పెళ్లికి ముహూర్తం ఫిక్స్

ఎట్టకేలకు పెళ్లికి ముహూర్తం ఫిక్స్

నయనతార - విఘ్నేష్ శివన్ పెళ్లి గురించి ఇప్పటికే ఎన్నో రకాల వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే వీళ్లిద్దరూ కొన్ని రోజుల క్రితమే ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. అయితే, పెళ్లి ఎప్పుడన్న దానిపై క్లారిటీ రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో నయన్, విఘ్నేష్ జూన్ 9న వివాహంతో ఒక్కటవబోతున్నారు. దీంతో వీళ్లిద్దరి అభిమానులు యమా ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.

అక్కడే పెళ్లి... గ్రాండ్‌గా ఈవెంట్

అక్కడే పెళ్లి... గ్రాండ్‌గా ఈవెంట్


నయనతార.. విఘ్నేష్ శివన్ పెళ్లికి సమయం ఆసన్నం అయిపోయింది. వీళ్లిద్దరూ జూన్ 9న తమిళనాడులోని మహాబలిపురంలో ఉన్న షెరటాన్ హోటల్‌‌‌లో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు. బీచ్ వ్యూ ఉండే ఈ హోటల్‌లో ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ పర్యవేక్షణలో వర్క్ జరిగింది. దీంతో ఈ పెళ్లి దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోతోంది.

భారీ ఏర్పాట్లు.. బిగ్ స్టార్స్ ఎంట్రీ

భారీ ఏర్పాట్లు.. బిగ్ స్టార్స్ ఎంట్రీ

దేశ వ్యాప్తంగా స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న నయనతార.. విఘ్నేష్ శివన్ వివాహ రిసెప్షన్‌కు భారీ ఏర్పాట్లు జరిగాయి. ఇందుకోసం ఖరీదైన హోటల్‌ను బుక్ చేయడంతో పాటు చాలా మంది బిగ్ సెలెబ్రిటీలకు ఆహ్వానం అందించారు. ఇక, ఈ పెళ్లికి కమల్ హాసన్, చిరంజీవి, అజిత్, సీఎం స్టాలిన్, విజయ్ సేతుపతి సహా ఎంతో మంది నటీనటులు రాబోతున్నారని తెలుస్తోంది.

పెళ్లిరోజు విఘ్నేష్ పోస్ట్ వైరల్‌గా

పెళ్లిరోజు విఘ్నేష్ పోస్ట్ వైరల్‌గా


నయనతారను వివాహం చేసుకోబోతున్న నేపథ్యంలో విఘ్నేష్ శివన్ ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించాడు. తాజాగా అతడు 'ఈరోజు జూన్ 9. నయనతార పెళ్లి. ఆ దేవుడికి, ఈ విశ్వానికి, నా మంచి కోరే ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రతి మంచి ఆత్మ, ప్రతి మంచి క్షణం, ప్రతి ఆశీర్వాదం, ప్రతిరోజూ షూటింగ్ నా జీవితాన్ని మరింత అందంగా మార్చేశాయి' అని తన పోస్టులో పేర్కొన్నాడు.

ప్రేమకు ధన్యవాదాలు అంటూ

ప్రేమకు ధన్యవాదాలు అంటూ

విఘ్నేష్ శివన్ తన పోస్టులో 'మా కోసం మీ అందరూ చేసిన ప్రార్ధనలకు ధన్యవాదాలు. నయనతార.. నా భార్య.. మరికొన్ని గంటల్లోనే నీతో కలిసి ఏడడుగులు వేయబోతున్నందుకు సంతోష పడుతున్నాను. నీతో కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నందుకు సంతోషంతో ఎదురు చేస్తున్నారు. అందరికీ మంచి జరగాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను' అని చెప్పుకొచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X