twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అజిత్ బర్త్ డేపై విజయ్ ఫ్యాన్స్ పెత్తనం.. పీక్స్‌లో ట్విట్టర్ వార్.. దేశవ్యాప్తంగా విజయ్‌దే హవా

    |

    అభిమానుల మధ్య ఘర్షణలు రావడం సహజమే. హీరోల మధ్య ఎలాంటి గొడవలు ఉన్నా లేకపోయినా వారు స్నేహంగా మెలిగినా వారి వారి అభిమానులు మాత్రం కొట్టుకుచస్తూనే ఉంటారు. తమ హీరోనే గొప్ప అని అవతల వారంటే.. కాదు కాదు తమ హీరోనే అందరికంటే మిన్న అని ఇవతల వారు వాదిస్తుంటారు. సరే ఈ వాదనలు ఎప్పుడూ ఉండేవే కదా అని తేలిగ్గా తీసుకుంటారు మరికొంతమంది.

    ఫ్యాన్స్ వార్ అనేవి ఎక్కువగా దక్షిణాదిలోనే కనిపిస్తాయి. అది మరీ ముఖ్యంగా తమిళ నాట ఓ రేంజ్‌లో కనిపిస్తుంది. అక్కడి హీరోలు, హీరోయిన్లకు గుళ్లు కూడా కట్టేస్తుంటారు ఫ్యాన్స్. తాజాగా అక్కడి అభిమానులు మళ్లీ గొడవకు దిగారు. సోషల్ మీడియాలో ట్వీట్లతో తమ ప్రతాపాన్ని చూపుతున్నారు. ఆ సంగతేంటో ఓసారి చూద్దాం.

    టాలీవుడ్ వర్సెస్ కోలీవుడ్..

    టాలీవుడ్ వర్సెస్ కోలీవుడ్..

    ఆ మధ్య ట్టిట్టర్‌లో టాలీవుడ్-కోలీవుడ్ హీరోలంటూ పెద్ద యుద్దమే జరిగింది. నారప్ప ఫస్ట్ లుక్ విషయంలో ఒకసారి అలా జరగ్గా.. విజయ్-మహేష్ బాబు ఫ్యాన్స్ మధ్య ట్వీట్ల యుద్దం జరగ్గా అది కూడా నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అయింది.

    అజిత్ పుట్టినరోజును కూడా..

    అజిత్ పుట్టినరోజును కూడా..

    నేడు (మే 1) తలా అజిత్ పుట్టినరోజు. అయితే ఈ విషయాన్ని కూడా ట్రెండ్ కానివ్వకుండా.. తమ హీరోనే గ్రేట్ అని చాటిచెప్పేలా ట్వీట్లతో ట్రెండ్ చేస్తున్నారు. అజిత్ విజయ్ మధ్య జరిగే బాక్సాఫీస్ పోరు ఎలా ఉంటుందో.. బయట వారిద్దరి ఫ్యాన్స్ మధ్య కూడా అలాంటి పోరే జరుగుతుంది. ఆ విషయం మరోసారి నిరూపించారు దళపతి ఫ్యాన్స్.

    కోలీవుడ్‌కు విజయ్ ఒక్కడే..

    కోలీవుడ్‌కు విజయ్ ఒక్కడే..

    కోలీవుడ్‌ను రూల్ చేసేది, లీడ్ చేసేది విజయ్ ఒక్కడే అన్నట్టుగా దళపతి ఫ్యాన్స్ ట్వీట్లతో హల్చల్ చేస్తున్నారు. #VijayTheFaceOfKollywood అనే హ్యాష్ ట్యాగ్ దేశవ్యాపంగా వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే 1.5మిలియన్ల ట్వీట్లతో ట్రెండ్ సెట్ చేశారు. దీంతో అజిత్ బర్త్ డే సంగతి పక్కకు జరగాల్సిన పరిస్థితి వచ్చింది.

    English summary
    Vijay And Ajith Fans War In Twitter On Thala Birthday. Thalapathy Fans Tweets Goes Viral. Now VijayTheFaceOfKollywood Hashtag Trending At No.1
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X