Vijay TVK-Trisha: విజయ్-త్రిషల పెళ్లి రూమర్లు.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?

Vijay TVK-Trisha: తమిళనాడు రాజకీయాల్లో స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay) సంచలన విజయాన్ని నమోదు చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ ఏకంగా 108 స్థానాల్లో విజయం సాధించి, తమిళనాడులో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఒక్క అడుగు దూరంలో ఉన్నారు. త్వరలోనే విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ దళపతి సినిమా కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు నెట్టింట వైరలవుతున్నాయి. ముఖ్యంగా త్రిషతో విజయ్ రిలేషన్ షిప్, వారిద్దరూ కలిసి ఎన్ని సినిమాలు చేశారు? వారిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత? వంటి అంశాలు చర్చనీయంగా మారాయి.

Also Read
ఆ పాత్రకు నేను సెట్ కాలేదనిపించింది.. సాయి పల్లవి ప్ర‌శ్చాత్తాపం..
ఆ పాత్రకు నేను సెట్ కాలేదనిపించింది.. సాయి పల్లవి ప్ర‌శ్చాత్తాపం..

దళపతి విజయ్-త్రిషల జోడీకి తమిళ సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. 2004లో వచ్చిన గిల్లీ (Ghilli) సినిమాతో వీరిద్దరూ తొలిసారి కలిసి నటించారు. తెలుగు బ్లాక్‌బస్టర్ 'ఒక్కడు'కి రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా తమిళనాట సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత తిరుపాచి, ఆది, కురువి ఇటీవల వచ్చిన లియో (Leo) వంటి సినిమాల్లో ఈ జంట మరోసారి ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా 'లియో' సినిమా తర్వాత వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం మరింత చర్చనీయాంశమైంది.

Recommended For You
తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని ఉంది.. యంగ్ హీరోయిన్ మనసులో మాట!
తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని ఉంది.. యంగ్ హీరోయిన్ మనసులో మాట!
Vijay and Trisha Relationship Rumors Go Viral After TVK Election Victory in Tamil Nadu

సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. 'గిల్లి' సినిమా సమయంలోనే విజయ్-త్రిష మధ్య సన్నిహిత్యం పెరిగిందని అప్పట్లోనే రూమర్లు వినిపించాయి. అయితే విజయ్ అప్పటికే వివాహితుడు కావడం, కుటుంబ పరిస్థితుల కారణంగా ఇద్దరూ కొంత దూరంగా ఉన్నారని ప్రచారం జరిగింది. దాదాపు 15 ఏళ్ల తర్వాత 'లియో' కోసం మళ్లీ కలిసి నటించడంతో పాత రూమర్లు మళ్లీ తెరపైకి వచ్చాయి.

You May Also Like
ఎన్టీఆర్ మూవీలో కాంట్రవర్సీ నటుడు.. ప్రశాంత్ నీల్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!
ఎన్టీఆర్ మూవీలో కాంట్రవర్సీ నటుడు.. ప్రశాంత్ నీల్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!

ఈ నేపథ్యంలోనే విజయ్ భార్య సంగీత సోర్నలింగం విడాకుల పిటిషన్ దాఖలు చేసిందనే వార్తలు మరింత సంచలనం సృష్టించాయి. ఒక స్టార్ హీరోయిన్‌తో విజయ్ సన్నిహితంగా ఉంటున్నారని ఆమె ఆరోపించినట్లు ప్రచారం జరగడంతో సోషల్ మీడియాలో త్రిష పేరు ట్రెండ్ అయింది. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేకపోయినా, ఇటీవల విజయ్-త్రిష కలిసి పలు వ్యక్తిగత వేడుకల్లో కనిపించడం, ఒక వివాహ కార్యక్రమానికి కలిసి హాజరవడం వంటి సంఘటనలు రూమర్లకు మరింత బలం చేకూర్చాయి.

'గాడ్ ఆఫ్ వార్' మళ్లీ షాక్ ట్విస్ట్.. త్రివిక్రమ్ ప్లాన్ ఏంటి?
'గాడ్ ఆఫ్ వార్' మళ్లీ షాక్ ట్విస్ట్.. త్రివిక్రమ్ ప్లాన్ ఏంటి?

మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. త్రిష పుట్టినరోజు అయిన మే 4నే తమిళనాడు ఎన్నికల ఫలితాలు రావడం. అదే రోజున విజయ్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేయడంతో అభిమానులు సోషల్ మీడియాలో "లక్కీ చార్మ్ త్రిష" అంటూ పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. ఇక కొందరు నెటిజన్లు 'విజయ్ సీఎం అయిన వెంటనే త్రిషను పెళ్లి చేసుకుంటాడు' అంటూ ప్రచారం చేస్తుండగా, మరికొందరు 'ముందు పాలనపై ఫోకస్ పెడతాడు.. ఆ తర్వాతే వ్యక్తిగత నిర్ణయం తీసుకుంటాడు'అని కామెంట్స్ చేస్తున్నారు.

NBK111: నయన్ ఔట్.. కాజల్ ఇన్? ఆ బాలీవుడ్ బ్యూటీతో బాలయ్య మాస్ స్టెప్పులు
NBK111: నయన్ ఔట్.. కాజల్ ఇన్? ఆ బాలీవుడ్ బ్యూటీతో బాలయ్య మాస్ స్టెప్పులు

ఇదిలా ఉంటే ఇప్పుడు నెటిజన్లలో మరో ఆసక్తికర చర్చ ఏంటంటే.. విజయ్-త్రిషల మధ్య వయసు తేడా ఎంత? అధికారిక వివరాల ప్రకారం విజయ్ 1974 జూన్ 22న జన్మించారు. ప్రస్తుతం ఆయన వయసు 51 సంవత్సరాలు. త్రిష మాత్రం 1983 మే 4న జన్మించింది. ప్రస్తుతం ఆమెకు 43 ఏళ్లు. అంటే వీరిద్దరి మధ్య దాదాపు 8 నుంచి 9 ఏళ్ల వరకు ఏజ్ గ్యాప్ ఉంది. ఈ విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రతి రాత్రి నరకం.. ప్రేమ పేరుతో మోసం..వాడుకొని వదిలేశాడు..
ప్రతి రాత్రి నరకం.. ప్రేమ పేరుతో మోసం..వాడుకొని వదిలేశాడు..

త్రిష విషయానికి వస్తే, ఆమె ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గానే కొనసాగుతున్నారు. గతంలో వ్యాపారవేత్త వరుణ్ మనియన్‌తో నిశ్చితార్థం జరిగినప్పటికీ, ఆ సంబంధం తర్వాత రద్దయింది. అప్పటి నుంచి త్రిష వ్యక్తిగత జీవితంపై అనేక రూమర్లు వచ్చినా, ఆమె ఎప్పుడూ స్పందించలేదు. ఇప్పుడు మాత్రం విజయ్‌తో సంబంధం ఉన్న వార్తలు జాతీయ స్థాయిలో చర్చకు దారి తీస్తున్నాయి. అయితే ఇప్పటివరకు విజయ్ లేదా త్రిష ఈ రూమర్లపై అధికారికంగా స్పందించలేదు. అయినప్పటికీ రాజకీయ విజయంతో పాటు వ్యక్తిగత జీవితం కూడా ఇప్పుడు విజయ్‌ను వార్తల్లో నిలిపేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X