నా కూతురుతోపాటు నేను చనిపోయాను.. ఆమెతోనే గడుపుతున్నా.. గుండెలు పగిలేలా విజయ్ ఆంటోని లేఖ

మ్యూజిక్ డైరెక్టర్, యాక్టర్, డైరెక్టర్, నిర్మాత విజయ్ ఆంటోని తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇటీవల ఆయన కుమార్తె మీరా ఇంట్లో ఉరి వేసుకొని మరణించడం పుట్టెడు శోకంలో ముంచెత్తింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా అన్ని సినిమా రంగాల్లోని ప్రముఖులను, అభిమానులను కుదిపేసింది. పుట్టెడు దు:ఖంలో మునిగిపోయిన విజయ్ ఆంటోనిని, ఆయన కుటుంబాన్ని పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. అయితే తన కూతురు మరణంపై విజయ్ ఆంటోని పంపిన వాట్సాప్ ఛాట్ అందర్నీ కలిచి వేస్తున్నది. ఈ వివరాల్లోకి వెళితే..

కూతురు మరణంతో విషాదంలోకి:కూతురు మీరా అనూహ్యంగా తీవ్ర నిర్ణయం తీసుకోవడం విజయ్ ఆంటోని జీర్ణించుకోలేకపోతున్నాడు. పోస్ట్ మార్టమ్ అనంతరం అంత్యక్రియలు నిర్ణయించిన తర్వాత మరింత విషాదంలోకి కూరుకుపోయారు. తన కూతురు మరణం గురించి గుండెలు పగిలేంతగా తన భావోద్వేగాలను లేఖలో రాశారు.

Vijay Antony emotional WhatsApp Chat letter on Daughter Meera death goes heart melting

వివక్ష లేని ప్రాంతానికి..:లీకైన వాట్సాప్ ఛాట్ ప్రకారం.. నా కూతురు మీరా చాలా దయ, క్షమాగుణం కలిగిన వ్యక్తి. అంతే కాకుండా ధైర్యవంతురాలు. కానీ అనూహ్యమైన నిర్ణయం తీసుకొన్నారు. కులం, మతం, డబ్బు, శతృత్వం, బాధ, పేదరికం, విద్వేషాలు లేని.. ప్రపంచంలో ఎవరూ వెళ్లలేని మంచి ప్రదేశానికి వెళ్లారు. ప్రస్తుతం ఆమె ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నారు అని విజయ్ ఆంటోని చెప్పారు.

Vijay Antony emotional WhatsApp Chat letter on Daughter Meera death goes heart melting

నేను కూడా చనిపోయాను:తిరిగిరాని లోకాలకు వెళ్లిన మీరా నాతో రోజు మాట్లాడుతున్నారు. నేను కూడా ఆమెతో చనిపోయాను. నా కూతురుతోనే ఉంటున్నాను. నా కూతురుతో కలిసి జీవిస్తున్నాను. ఆమె కొన్ని గొప్ప పనులు చేయాలని నన్ను ఆదేశించారు. ఆమె పేరుతో నేను కొన్ని కార్యక్రమాలు చేయాలని నిర్ణయించాను అని విజయ్ ఆంటోని తన వాట్సప్ ఛాట్‌లో పేర్కొన్నారు.

Vijay Antony emotional WhatsApp Chat letter on Daughter Meera death goes heart melting

మీరా మరణంపై రూమర్లు:విజయ్ ఆంటోని కూతురు మీరా కొన్ని వివక్ష ఎదుర్కొన్నారనే విషయం బయటకు వచ్చింది. లావుగా, నల్లగా ఉన్నారనే మాటలు మీరాను తీవ్రంగా కలిచివేసేలా చేశాయని వివరాలు మీడియాలో ప్రచారం అవుతున్నాయి. అయితే మీరా మరణం వెనుక అనేక రూమర్లు, వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే వాటిని విజమ్ ఆంటోని వర్గాలు ఖండిస్తున్నాయి.

Vijay Antony emotional WhatsApp Chat letter on Daughter Meera death goes heart melting

ఫొరెన్సిక్ టీమ్ రంగంలోకి :ఇదిలా ఉండగా, విజయ్ ఆంటోని కూతురు మీరా మరణం తర్వాత ఆమె ఫోన్ సీజ్ చేశారు. ఫొరెన్సిక్ నిపుణులు, చెన్నై ప పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. మీరా ఫోన్‌లో ఎలాంటి ఛాటింగ్స్, ఫోటోలు ఉన్నాయనే కోణంలో దృష్టిపెట్టారు. త్వరలోనే మీరా మరణానికి కారణాలను పోలీసులు బయటపెట్టే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X