పీకల్లోతు నష్టాల్లో నిర్మాత.. విజయ్ ఆంటోని సంచలన నిర్ణయం.. ఎంత తగ్గాడంటే

కరోనా వైరస్ ప్రభావం సినీ పరిశ్రమపై తీవ్రంగా ఉండటంతో సినీ తారలు, నిర్మాత, దర్శకులందరూ సంచలన నిర్ణయాలు తీసుకొనేందుకు సిద్ధమవుతున్నారు. రానున్న రోజులు సినిమా ఇండస్ట్రీకి గడ్డుపరిస్థితి మారే విధంగా ఉండటంతో హీరో, హీరోయిన్లు, ఇతర నటీనటులు తమ రెమ్యునరేషన్లను తగ్గించుకొనేందుకు కూడా సిద్దపడుతున్నారు. తాజాగా విజయ్ ఆంటోని తీసుకొన్న నిర్ణయం సెన్సేషనల్‌గా మారింది. ఇంతకు ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకొన్నారంటే..

మూడు చిత్రాలు విడుదలకు రెడీ

మూడు చిత్రాలు విడుదలకు రెడీ

కరోనా వైరస్ ప్రభావం గురించి విజయ్ ఆంటోని ఇటీవల మాట్లాడుతూ.. తమిళ సినిమా పరిశ్రమపై ఈ ప్రాణాంతక వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంది. మార్చి నుంచి పరిస్థితి గందరగోళంగా మారింది. నేను నటించిన మూడు చిత్రాలు పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను చూస్తే మరో నాలుగు నెలలపాటు ఇదే కొనసాగే అవకాశం కనిపిస్తున్నది అని అన్నారు.

నిర్మాతలకు గడ్డుపరిస్థితి

నిర్మాతలకు గడ్డుపరిస్థితి

తాను నటించిన మూడు చిత్రాలు తమిజ్ హరసాన్, అగ్ని సిరగుగల్, ఖాకీ సినిమాల విడుదల నిలిచిపోవడంతో నిర్మాతలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మూడు, నాలుగు నెలలు సినిమాలు రిలీజ్ కాకపోతే తీవ్ర నష్టాలు వెంటాడే అవకాశం ఉంది. ఈ కారణంగా నేను నా రెమ్యునర్ల నుంచి 25 శాతం కోత విధించుకొన్నాను అని విజయ్ ఆంటోని తెలిపారు.

విజయ్ సంచలన నిర్ణయంతో

విజయ్ సంచలన నిర్ణయంతో

ప్రస్తుత కరోనా పరిస్థితులల్లో నిర్మాతలకు ఊరట కలిగించే విధంగా విజయ్ ఆంటోని వ్యవహరించడం చాలా ఆనందంగా ఉంది. ఆయన 25 శాతం తన రెమ్యునరేషన్‌ను తగ్గించుకోవడం వల్ల రూ.1 కోటి మేరకు నిర్మాతలపై భారం తగ్గుతున్నది. ఇది విజయ్ ఆంటోని తీసుకొన్న ఉదారత కూడిన గొప్ప నిర్ణయం అని నిర్మాత టీ శివ వ్యాఖ్యానించారు.

Recommended Video

Pawan Kalyan Fans Questions Tollywood Big Stars | Vijay Devarakonda
తగ్గుతున్న హీరో, హీరోయిన్లు

తగ్గుతున్న హీరో, హీరోయిన్లు

తమిళ, దక్షిణాది సినిమా పరిశ్రమలో నెలకొన్న సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని పలువురు హీరోలు, హీరోయిన్లు తమ పారితోషికాన్ని తగ్గించుకొనేందుకు ముందుకొస్తున్నారు. దీంతో కొంత ఒత్తిడి నిర్మాతపై తగ్గుతుంది. సాధారణ పరిస్తితి నెలకొనే వరకు ప్రతీ పైసా అత్యంత కీలకంగా మారుతుంది. హీరోల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం అని ఓ నిర్మాత మీడియాతో అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X