అభిమానులు చేసిన పనికి క్షమాపణలు కోరిన విజయ్.. అందరి ముందు చేతులు జోడించి..

తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలు కొందరు స్టార్ హోదా ఎంత పెరుగుతున్నా కూడా చాలా ఒదిగి ఉంటారు. అగ్రహీరోలు అయితే వీలైనంత వరకు వివాదాలు లేకుండా సమస్యలను మొదట్లోనే పరిష్కారం చేసుకునే విధంగా అడుగులు వేస్తూ ఉంటారు. ఇక వివాదాలు లేకుండా సెన్సిటివ్ గా కనిపించే మంచి హీరోలలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కూడా టాప్ లిస్టులో ఉంటాడు. అయితే అభిమానుల కారణంగా ఇటీవల కొందరికి ఒక చేదు అనుభవం ఎదురవ్వడంతో అందరి ముందు చేతులు జోడిస్తూ క్షమాపణలు కోరారు. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

తెలుగులో కూడా..

తెలుగులో కూడా..

తమిళ చిత్ర పరిశ్రమలో గత కొంత కాలంగా అగ్ర హీరోగా మంచి క్రేజ్ అందుకుంటున్న విజయ్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద ఈజీగా 300 కోట్లకు పైగా బిజినెస్ చేస్తున్నాయి.. ఒక విధంగా రజనీకాంత్ కంటే ఎక్కువగా విజయ్ తన మార్కెట్ ను పెంచుకుంటున్నాడు అనే చెప్పాలి. ప్రస్తుతం విజయ్ కు తమిళ ఇండస్ట్రీలో పోటీ లేదు. తెలుగులో కూడా అతని మార్కెట్ కొంచెం కొంచెంగా పెరుగుతోంది.

అభిమానుల కారణంగా..

అభిమానుల కారణంగా..

ఎలాంటి పొరపాటు జరిగినా కూడా విజయ్ తన వైపు నుంచి తప్పు ఉంటే వెంటనే క్షమాపణలు చెప్పడానికి సిద్ధంగా ఉంటాడు. అంతేకాకుండా తన సన్నిహితులు ఎవరు తప్పు చేసినా కూడా వెంటనే రిప్లై ఇవ్వడానికి కూడా రెడీ అవుతాడు. ఇక రీసెంట్ గా అభిమానుల తాకిడి ఎక్కువ కావడంతో ఒక ప్రదేశంలో మీడియా సభ్యులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే వారికి చేతులు జోడించి నమస్కారం పెడుతూ విజయ్ క్షమాపణ కోరాడు.

 విజయ్ వచ్చాడని..

విజయ్ వచ్చాడని..

చెన్నైలో స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా విజయ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఓటు వేసే బూత్ దగ్గరకు వస్తున్నాడని తెలిసి అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఇక అభిమానులను పోలీసులు సెక్యూరిటీ కూడా కంట్రోల్ చేయకపోయింది. అభిమానుల తాకిడికి మిగతా సాదారణ ప్రజలతో పాటు మీడియా సభ్యులు కూడా ఇబ్బంది పడ్డారు.

రెండు చేతులు జోడించి..

రెండు చేతులు జోడించి..

ఇక విజయ్ వారు పడుతున్న ఇబ్బందిని చూసి అందరికి అక్కడే క్షమాపణ కోరాడు. రెండు చేతులు జోడించి నమస్కారం పెడుతూ ఇబ్బంది పడుతున్న కారణంగా క్షమాపణ కోరాడు. ఇక మీడియా సభ్యులు కూడా అతని విధేయతకు ఫిదా అయ్యారు. హలో జెంటిల్మెన్ ప్రౌడ్ గా ఉందని కొనియాడారు. ఇక విజయ్ అతి కష్టం మీద అక్కడి నుంచి తన కారు దగ్గరకు చేరుకొని ఇంటికి వెళ్లిపోయారు.

 బీస్ట్ సాంగ్ ట్రెండింగ్

బీస్ట్ సాంగ్ ట్రెండింగ్

ఇక ప్రస్తుతం విజయ్ బీస్ట్ సినిమాను విడుదలకు సిద్ధం చేసిన విషయం తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలోని మొదటి పాటను ఇటీవల విడుదల చేయగా ఆ పాటకు మంచి గుర్తింపు లభించింది. అరబిక్ కుత్తు పాటు అన్ని భాషల వారికి నచ్చే విధంగా చాలా డిఫరెంట్ గా ఉండడంతో సోషల్ మీడియాలో ఈజీగా వైరల్ అయింది. యువ హీరో శివ కార్తికేయన్ రాసిన ఆ పాటను అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించి తనే పాడాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X