మురగదాస్ మరోసారి అదే హీరోతో...
మాస్, కమర్షియల్ హంగులతో ఉన్న కథ 'ఇలయ తలబది' నచ్చడంతో పచ్చజెండా ఉపాడట. 'అదిరడి' అనే టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. 'తుప్పాక్కి'కి మించిన స్థాయిలో తీసుకొచ్చేందుకు సంబంధిత వర్గాలు సన్నాహాలు జరుపుతున్నట్లు కోడంబాక్కంలో వార్తలు వినిపిస్తున్నాయి. 'తలైవా' (అన్న) సమస్యల నుంచి విముక్తి పొందిన విజయ్ ప్రస్తుతం 'జిల్లా'లో నటిస్తున్నాడు. చివరిదశ చిత్రీకరణ జరుపుకుంటోంది.
విజయ్,కాజల్ మరియు విద్యుత్ కీలక పాత్రలలో నటించిన తుపాకి చిత్రం ఆరు రోజులకు కాను 45 కోట్లను వసూలు చేసింది. తెలుగు ఈ ఏడాది విజయం సాదించిన అతి తక్కువ డబ్బింగ్ చిత్రాలలో ఇది ఒకటి అయ్యింది. ఇదిలా ఉండగా కోలీవుడ్ సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని మురగదాస్ హిందీలో అక్షయ్ కుమార్ తో రీమేక్ చెయ్యనున్నారని తెలుస్తుంది. హిందీ మరియు తమిళంలో ఒకేసారి తెరకెక్కించాలని మురగదాస్ అనుకున్నా అక్షయ్ కుమార్ డేట్స్ దొరకకపోవడంతో విరమించుకున్నారు. కాజల్ పాత్రలో పరినీతి చోప్రా కనిపిస్తుండగా ఈ చిత్రాన్ని విపుల్ షా నిర్మించనున్నారు. త్వరలో ఈ చిత్రం చిత్రీకరణ మొదలు పెట్టుకోనుంది. గతంలో మురగదాస్ ,అమీర్ ఖాన్ "గజినీ" చిత్రంతో బాలీవుడ్లో విజయం దక్కించుకున్నాడు.
ఇక మురగదాస్ కు ...తెలుగు హీరో రామ్ చరణ్ తో సినిమా చేయాలని కోరిక ఉందిట. ఆ విషయాన్ని మీడియాకు చెప్తూ..నేను త్వరలో తెలుగులో మరో స్టైయిట్ సినిమా చేస్తాను.అందులో ఢెఫినెట్ గా రామ్ చరణ్ హీరోగా ఉంటారు. ఆయన మగధీరలో వర్క్ చూసి నేను చాలా ఇష్టపడ్డాను అన్నారు. మురగదాస్ తన తదుపరి చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications












