ముంబయి దాదా గా విజయ్ కొత్త చిత్రం
చెన్నై : విజయ్‌కు ముంబయి నేపథ్యం కలిసొస్తున్నట్టే ఉంది. ఆయన తాజా చిత్రంలోనూ ఆ ప్రాంతానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ముంబయితో ముడిపడి తెరకెక్కిన 'తుపాకి' కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఆయన కెరీర్‌లోనే అతిపెద్ద విజయంగా నిలిచింది.
'ఇలయ తలబది' ప్రస్తుతం ఏఎల్ విజయ్ దర్శకత్వంలో 'తలైవా'లో నటిస్తున్నాడు. అమలాపాల్ హీరోయిన్. హీరో విజయ్ ఈ చిత్రంలో ముంబయి దాదాగా కనిపించనున్నాడు. ఈ విషయాన్ని దర్శకుడే స్వయంగా ప్రకటించాడు.
దర్శకుడు మాట్లాడుతూ.. 1980లో ముంబయిని గడగడలాడించిన వరదరాజ ముదలియార్ అనే వ్యక్తి జీవిత చరిత్రకు దగ్గరి పోలికలతో హీరో పాత్ర సాగుతుంది. భిన్నమైన రూపంతో కనిపిస్తాడు. తెలుపు వస్త్రాలతో చూపించనున్నాము అన్నారు.
అలాగే హైలెట్స్ వివరిస్తూ...'తలైవా తలైవా సరిత్తరం ఎళుదు' అనే పాట హైలెట్‌గా ఉంటుంది. ఇందులో 500 మంది డ్యాన్సర్లతో విజయ్ అద్భుతంగా అడుగులేశాడు.
అన్ని పనులు పూర్తి చేసి విజయ్ పుట్టినరోజు కానుకగా జూన్ 21న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని వివరించారు. షూటింగ్ పూర్తయిన నేపథ్యంలో నిర్మాణాంతర పనులు సాగుతున్నాయి. సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్.


Click it and Unblock the Notifications












