సమంతతో నాలుగోసారి.. క్రేజీ కాంబినేషన్‌కు రంగం సిద్ధం!

Recommended Video

Important Update About 'Thalapathy 63'

స్టార్ హీరో విజయ్ పేరు ప్రస్తుతం మారుమోగుతోంది. సర్కార్ చిత్రం బ్లాక్ బాస్టర్ వసూళ్లతో దూసుకుపోతోంది. మెర్సల్, సర్కార్ చిత్ర వివాదాలతో విజయ్ గురించి జాతీయ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా విజయ్ తిరుగులేని విజయాలు అందుకుంటున్నాడు. సర్కార్ చిత్రం అయితే కొంత నెగిటివ్ టాక్ వచ్చినా భారీ వసూళ్లు సాధిస్తోంది. ప్రస్తుతం సర్కార్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న విజయ్ తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నాడు.

మరో హ్యాట్రిక్ కాంబినేషన్

మరో హ్యాట్రిక్ కాంబినేషన్

సర్కార్ చిత్రంతో విజయ్, మురుగదాస్ కాంబినేషన్ హ్యాట్రిక్ పూర్తి చేసినట్లు అయింది. విజయ్ మరో హ్యాట్రిక్ కు సిద్ధం అవుతున్నాడు. టాలెంటెడ్ యువ దర్శకుడు అట్లీ దర్శత్వంలో విజయ్ తదుపరి చిత్రం ఉండబోతోంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన తేరి, మెర్సల్ చిత్రాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి.

క్రేజీ హీరోయిన్లు

క్రేజీ హీరోయిన్లు

విజయ్, అట్లీ చిత్రానికి క్రేజీ హీరోయిన్ల పేర్లు వినిపిస్తుండడం విశేషం. నయనతార, సమంత ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తారట. నయనతార సౌత్ లేడి సూపర్ స్టార్ గా రాణిస్తోంది. ఇక సమంత అద్భుతమైన పాత్రలు ఎంచుకుంటూ దూసుకుపోతోంది. సమంత, నయనతార ఇదివరకే విజయ్ సరసన నటించి ఉన్నారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. సమంత, విజయ్ కాంబినేషన్ లో వస్తున్న నాలుగో చిత్రం ఇది.

ఈ సారి ఎలాంటి సంచలనమో

ఈ సారి ఎలాంటి సంచలనమో

మెర్సల్ చిత్రంలో ఇండియాలో అవలంభిస్తున్న వైద్య విధానంపై అట్లీ విమర్శలు సంధించాడు. మెర్సల్ చిత్రం ఎంత ఘనవిజయం సాధించిందో అంతే స్థాయిలో వివాదాలు కూడా సృష్టించింది. అట్లీ ఈ సారి ఎలాంటి కథతో రాబోతున్నాడనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది.

సైలెంట్‌గా

సైలెంట్‌గా

ఎలాంటి హడావిడి లేకుండా విజయ్, అట్లీ మూడో చిత్రం చిన్న పూజా కార్యక్రమంతో ప్రారంభమైపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఏజిఎస్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ జనవరిలో ప్రారంభం కానుందట. 2019 దీపావళికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

త్వరలోనే ప్రకటన

త్వరలోనే ప్రకటన

ఈ చిత్రం గురించి త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారట. అట్లీ, విజయ్,నయనతార, సమంత క్రేజీ కాంబినేషన్ లో రాబోయే ఈ చిత్రంతో విజయ్ అభిమానులకు పండగ అనే చెప్పొచ్చు. ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు అనిరుద్ మ్యూజిక్ అందించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X