ఓ వైపు కలెక్షన్ల కుంభవృష్టి.. మరో వైపు విజయ్ మెరుపు వేగం!
సర్కార్ సినిమాతో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న విజయ్ స్పీడ్ పెంచేశాడు. ఓ వైపు సర్కార్ విజయం ఢంకా మోగిస్తుండగానే మరో సినిమాను లైన్లో పెట్టేశాడు. మెర్సల్ (తెలుగులో అదిరింది) చిత్రం లాంటి బ్లాక్ బస్టర్ అందించిన అట్లీతో జతకలిశాడు. కెరీర్‌లో దళపతి విజయ్‌కి ఇది 63వ సినిమా. ఈ చిత్రాన్ని కళాపతి ఎస్ అగ్రహారం నిర్మిస్తున్నాడు. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు నవంబర్ 14న చెన్నైలో జరిగాయి.
దళపతి 63వ సినిమా పక్కామాస్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని హామీ ఇస్తున్నాం. భారీ తారాగణం, అద్భుతమైన టెక్నిషియన్లు, ఉత్తమ నిర్మాణ విలువలతో సినిమా రూపొందుతుందనే గ్యారెంటీ ఇస్తున్నాం.

విజయ్ 63ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు గ్లోబల్ టాలెంట్‌ను సమకూరుస్తున్నాం. ఈ జనరేషన్‌కు నచ్చే సినిమా ఇది. విజయ్ క్రేజ్, ఇమేజ్‌కు సరిగ్గా సరిపోయే చిత్రం అని చిత్ర యూనిట్ ఓ ప్రకటనను జారీ చేసింది.
సినీ వర్గాల కథనం ప్రకారం.. సమంత ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నట్టు తెలిసింది. ఏఆర్ రెహ్మన్ సంగీతం, జీకే విష్ణు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. త్వరలోనే అధికారికంగా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటిస్తామని చిత్ర యూనిట్ పేర్కొన్నది.


Click it and Unblock the Notifications











