అభిమానుల పెళ్లిలో హీరో సందడి(ఫొటో)

By Srikanya

చెన్నై : అభిమానులు మన సినిమాలు చూసి హిట్ చేయాలనే ఆలోచన మాత్రమే కాకుండా అభిమానులతో సామాజిక కార్యక్రమాలు చేయించాలనే ఆలోచన కొద్ది మంది స్టార్ హీరోలకు ఉంది. అలాంటి వారిలో భిన్నమైన మాటతీరు, డైలాగులు, డాన్సులతో ఆకట్టుకుంటున్న మాస్‌ నటుడు 'ఇలయ తలబది' విజయ్‌ ఒక. తన అభిమానుల సంఘాన్ని కూడా సేవాసంఘంగా మార్చారాయన.

ఈ నేపథ్యంలో కోవైలో ఇటీవల జరిగిన తన అభిమానుల సామూహిక వివాహానికి విజయ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తాళిబొట్టు అందజేసి.. నూతన వధూవరులను దీవించారు. తాను కూడా పట్టుపంచె, చొక్కా ధరించి అభిమానులను అలరించారు. ఆ తర్వాత అందరితోనూ ఫొటోలు దిగి కాసేపు సందడి చేశారు.

కొంతకాలంగా విజయ్‌ అభిమానులు పలు సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. ఇటీవల మదురైలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో తన అభిమాన హీరో చేతుల మీదుగా పేదలు, విద్యార్థులు ఉచితాలను పంపిణీ చేశారు. ప్రస్తుతం ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలోని 'కత్తి'లో విజయ్‌ నటిస్తున్నారు. ఓ వైపు ఈ సినిమా సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నా.. తాను మాత్రం చిత్రీకరణలో పాల్గొంటున్నారు. అప్పుడప్పుడు అభిమానులతో భేటీ అవుతున్నారు.

ఇక 'కత్తి' విశేషాలు కి వస్తే...

'జిల్లా' తర్వాత 'ఇలయ తలబది' విజయ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'కత్తి'. 'తుపాక్కి' తర్వాత ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో నటిస్తున్నారాయన. ఇందులో తొలిసారిగా విజయ్‌ సరసన సమంత కథానాయికగా నటిస్తోంది. ముంబయిలో పలు కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించారు. విజయ్‌, మురుగదాస్‌ కాంబినేషన్‌లో స్లీపర్‌సెల్స్‌ నేపథ్యంలో తెరకెక్కిన 'తుపాక్కి' ఘనవిజయం సాధించింది. ఈ చిత్రం రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.

దీంతో మురుగదాస్‌ అంటేనే వందకోట్ల మార్కెట్‌ను సునాయాసంగా ఛేదించగలడనే నమ్మకం ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో బలంగా నాటుకు పోయింది. ఆ దిశగా ఈ సినిమా కూడా వందకోట్లను వసూలు చేస్తుందని సంబంధిత వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. అందుకు తగ్గట్టుగానే సినిమా పోస్టర్లు, టీజర్‌లు కూడా మంచి ఆదరణను సంపాదించుకున్నాయి.

విజయ్‌ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన పోస్టర్లలో విజయ్‌ భిన్నంగా కనిపిస్తుండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రధాన భవనాలతో కూడిన చెన్నైని చూపుతూ.. ఆ సన్నివేశం విజయ్‌ ముఖం మాదిరిగా ముగిసేలా వచ్చిన టీజర్‌కు 'కత్తి'లాంటి రెస్పాన్స్‌ వచ్చింది. మరి 'కత్తి' వసూళ్ల విషయంలో ఎలాంటి పేరు తెచ్చుకుంటుందో వేచిచూడాల్సిందే.

Vijay Attended a Grand Marriage Function of his Fans

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X