Just In
- 17 min ago
Ala Vaikunthapurranuloo భారీ రేటుకు హక్కులు...చక్రం తిప్పిన థమన్!
- 50 min ago
ప్రభాస్ కోసం బరిలోకి శంకర్, దిల్ రాజు! దెబ్బకు రేంజ్ డబుల్..!!
- 1 hr ago
శ్వేతబసుకు మరో షాక్.. భర్తకు విడాకులు.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు
- 1 hr ago
RRRలో ఎన్టీఆర్ లుక్ లీక్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో, పిక్స్
Don't Miss!
- News
పవన్ రెండు కాకుంటే మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటారు.. మీకెందుకు : జగన్ కు నటుడు నరేష్ చురకలు
- Lifestyle
కడుపు ఎడమ వైపు నొప్పికి గల కారణాలు ఏమిటి? అందుకు కారణాలేంటో తెలుసా?ఈ నొప్పి ప్రమాదకరమా?
- Sports
పాక్ క్రికెటర్‌పై నెటిజన్ల ఆగ్రహం.. ఇక జట్టులోకి తీసుకోకూడదంటూ కామెంట్లు!!
- Finance
హైదరాబాద్ ప్రయాణీకులకు శుభవార్త: మెట్రోలో G5 సేవలు.. కానీ!
- Technology
చైనా సంస్థలతో జట్టు కట్టేందుకు వ్యూహాలు రచిస్తున్న ఇంటెక్స్
- Automobiles
2020 స్కోడా ర్యాపిడ్ టీజర్ ఫోటోలు.. అసలైన మోడల్ ఇలా ఉంటుంది
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
గంటకో మిలియన్ వ్యూస్.. అదే అతడి స్టామినా.. దుమ్ములేపుతున్న ట్రైలర్
ఇళయ దళపతి విజయ్ సినిమా అంటే తమిళనాడు మొత్తం షేక్ అవ్వాల్సిందే. అసలే వరుస హిట్లతో బాక్సాఫీస్ మీద దాడి చేస్తూ ఆకలిని తీర్చుకుంటున్నాడు. తేరి, మెర్సల్, సర్కార్ వేటికవే రికార్డులను తిరగ రాస్తుండగా.. మరో సారి వాటిని బద్దలుకొట్టేందుకు రెడీ అయ్యాడు.

అట్లీ దర్శకత్వంలో.. ఫుట్‌బాల్ కోచ్‌గా
అట్లీ డైరెక్షన్‌లో ఇప్పటికే పోలీస్ ఆఫీసర్‌గా, డాక్టర్‌గా చేసిన విజయ్ ప్రస్తుతం ఫుట్‌బాల్ కోచ్‌గా మారిపోయాడు. అయితే అదొక్కటే ఉంటే దళపతి అభిమానులకు ఇచ్చే ట్రీట్ ఏముంటుంది? అందుకే మరో క్యారెక్టర్‌ను క్రియేట్ చేశాడు. ఒకటి కొంచెం క్లాస్‌గా కనించేలా.. మరొకటి ఊర మాస్ క్యారెక్టర్ ఇలా విజయ్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకునేందుకు రెడీ అయ్యాడు.
వైరల్‌గా మారిన బిగిల్ ట్రైలర్..
ఫుట్‌బాల్ కోచ్‌గా, ప్లేయర్‌గా బిగిల్ అదరగొట్టేసినట్లు కనిపిస్తోంది. ఇక యాక్షన్ సీన్స్ అయితే పీక్స్‌లో ఉన్నట్లు అర్థమవుతోంది. నయన్‌తో రొమాన్స్, యోగిబాబు కామెడీ, ఎమోషన్స్ ఇలా అన్నింటిని కలిపి వడ్డించినట్లుంది. వీటన్నింటతో పాటు ఆడవారి గురించి మంచి సందేశం ఉన్నట్లు కనిపిస్తోంది.

దీపావళికి సందడి...
ఈ దీపావళికి విజయ్ అభిమానులు అసలైన పండుగను చూస్తారు. ట్రైలర్ చివర్లో పేలినట్టు థియేటర్లు కూడా అభిమానులు అరిచే అరుపులతో పేలిపోవాల్సిందేనేమో. తమిళంతో పాటు ఈ చిత్రాన్ని అదే రోజును తెలుగులో కూడా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. విజిల్ టైటిల్‌తో రాబోతోన్న ఈ మూవీ ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా లేదా అన్నది చూడాలి.