twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విజయ్ ఖాతాలో మరో రికార్డు.. కాలర్ ఎగిరేస్తున్న ఫ్యాన్స్

    |

    ఇళయ దళపతి విజయ్ సినిమాలంటే.. తమిళ నాట ఉండే హవానే వేరు. వరుస విజయాలతో దూసుకుపోతూ.. రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు. తేరి, మెర్సెల్, సర్కార్ సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. తాజాగా మరోసారి బాక్సాఫీస్‌పై యుద్దం ప్రకటించనున్నాడు.

     మూడో సారి అట్లీ డైరెక్షన్‌లో..

    మూడో సారి అట్లీ డైరెక్షన్‌లో..

    తేరీ, మెర్సెస్ లాంటి సినిమాలతో సూపర్ హిట్ కొట్టిన అట్లీ.. విజయ్‌తో హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు రెడీ అయ్యాడు. బిగిల్ అంటూ విజయ్‌ను మరో పవర్ ఫుల్ పాత్రలో చూపించున్నాడు. ఫుట్‌బాల్ కోచ్‌గా కాస్త క్లాస్ లుక్‌లో కనిపించే ఓ పాత్ర, మాంసం వ్యాపారిగానూ ఫుల్ మాస్ యాంగిల్‌లో మరో పాత్రలో కనిపించి ఫ్యాన్స్‌ను అలరించనున్నాడు.

    తాజాగా విడదలైన ట్రైలర్

    బిగిల్ ట్రైలర్ విడుదలయ్యే రోజున సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. సాయంత్రం విడుదల చేసిన ఈ ట్రైలర్‌పై ఉదయం నుంచే ట్వీట్లతో హోరెత్తించారు అభిమానులు. ఈ దెబ్బకు ట్విట్టర్‌లో దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.

    బాలీవుడ్ నుంచి ప్రశంసల వెల్లువలు...

    బాలీవుడ్ నుంచి ప్రశంసల వెల్లువలు...

    ఈ ట్రైలర్ విడుదలైన కాసేపటికే వైరల్‌గా మారింది. గంటకో వ్యూస్ లెక్కను దూసుకుపోయింది. పవర్ ప్యాక్‌డ్‌గా చూపించిన ఈ మూవీ ట్రైలర్‌లో విజయ్ చేసిన యాక్షన్ సీన్స్ హైలెట్‌గా నిలిచాయి. ఈ మూవీ ట్రైలర్‌పై బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహర్, బాలీవుడ్ బాద్‌షా షారుక్ పొగడ్తల వర్షం కురిపించారు.

    రెండు మిలియన్ల లైకులతో టాప్..

    రెండు మిలియన్ల లైకులతో టాప్..

    ఇప్పటి వరకు మోస్ట్ లైక్డ్ ట్రైలర్‌గా బిగిల్ రికార్డులకెక్కింది. ఇంతకు ముందు ఈ రికార్డు షారుక్ నటించిన జీరో మూవీపై ఉండగా.. తాజగా విజయ్ బిగిల్ దాన్ని అధిగమించింది. విడుదలై వారం రోజులు కూడా కాలేదు.. ఇప్పటికీ ఈ ట్రైలర్‌ను 29 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకోగా.. రెండు మిలియన్ల లైకులతో టాప్ ప్లేస్‌ను సొంతం చేసుకుంది.

    తాజాగా సెన్సార్ పూర్తి...

    తాజాగా సెన్సార్ పూర్తి...

    తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నట్లు అర్చన కళాపతి తెలినింది. ట్రైలర్‌పై చూపించిన అభిమానానికి ధన్యవాదాలను తెలిపారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నట్లు తెలిపింది. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్‌పై నిర్మించిన ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించాడు.

    English summary
    Vijay Bigil Movie Trailer Creates History. It Crosses 13 Millions Views In 13 Hours. It Got 2 Millions Likes And At Top of Youtube After Zero Movie. In Social Media Bigil Trailer Goes Viral. Movie Directed by Atlee And Music Composed By A R Rahman.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X