పుట్టిన రోజు సందర్భంగా గోల్డ్ రింగులు పంచిన హీరో
శంకర్ దర్శకత్వంలో వచ్చిన త్రీఇడియట్స్ రీమేక్ తెలుగు వెర్షన్ 'స్నేహితుడు' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన తమిళ హీరో విజయ్ ఈరోజు(జూన్ 22) 38వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా విజయ్ గవర్నమెంట్ ఆసుపత్రిలో బంగారు ఉంగారులు పంచారు.
శుక్రవారం ఉదయం అభిమానులతో పాటు చెన్నయ్‌లోని గవర్నమెంటు ఆసుపత్రికి చేరుకున్న విజయ్...తన పుట్టిన రోజైన ఈ రోజు జన్మించిన పిల్లలకు బంగారు ఉంగరాలు తొడిగారు. విజయ్ రాక సందర్భంగా ఆసుపత్రి వర్గాలు ప్రత్యేకమైన ఏర్పాటులు చేసి ఆహ్వానం పలికారు.
విజయ్ ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో 'తుపాకి' చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో విజయ్ సరసన హీరోయిన్ కాజల్ నటిస్తోంది. ఓ చిన్న గ్రామం నుంచి ముంబయ్ వెళ్లి అక్కడ డాన్ అవతారమెత్తిన ఓ యువకుడి కథ ఈ సినిమా. ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేస్తున్నారు.
విక్రమ్, సూర్య, కార్తి లాంటి తమిళ హీరోలకు తెలుగు నాట మంచి ఫాలోయింగ్ ఉండటంతో తాను కూడా తెలుగులో మార్కెట్ పెంచుకోవడానికి 'స్నేహితుడు' చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన విజయ్....తొలి ప్రయత్నంలో ఫెయిల్ అయ్యాడు. అయితే ఈ సారి తప్పకుండా సక్సెస్ సాధించాని 'తుపాకి' ఎక్కుపెట్టిన విజయ్ ఏమేరకు సక్సెస్ అవుతాడో చూడాలి.


Click it and Unblock the Notifications











