‘నోటా’ ప్రమోషన్స్‌లో నిర్లక్ష్యం... నిర్మాతపై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఫైర్!
పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్న విజయ్ దేవరకొండ.... 'గీత గోవిందం' సినిమాతో రూ. 100 కోట్ల క్లబ్‌లో టాలీవుడ్లో సరికొత్త స్టార్ హీరోగా అవతరించారు. విజయ్ అక్టోబర్ 5న 'నోటా' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తెలుగుతో పాటు తమిళంలో ఒకేసారి ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.
అయితే సినిమాను నిర్మిస్తున్న తమిళ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్స్ వారు ప్రమోషన్స్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ విజయ్ దేవరకొండ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పార్టీ సాంగ్ ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని చెప్పి... సమయానికి విడుదల చేయకపోవడమే ఇందుకు కారణం.

నోటా ప్రమోషన్స్ చాలా దారుణంగా జరుగుతున్నాయి. ఇలా జరుగడం తమను చాలా అప్‌సెట్ చేసింది. తెలుగులో కూడా సరైన ప్రమోషన్స్ నిర్వహించడం లేదు. విజయ్ నటించిన గత చిత్రం 'గీత గోవిందం' విషయంలో గీతా ఆర్ట్స్ అద్భుతమైన ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టింది. కానీ 'నోటా' విషయంలో అలాంటి ప్రమోషన్స్ జరుగడం లేదు అంటూ ఓ అభిమాని ట్వీట్ చేశారు.
పోల్: బిగ్‌బాస్ తెలుగు 2 విజేతను మీరే తేల్చేయండి.. మీ ఓటు వేసేందుకు లింక్ క్లిక్ చేయండి!
'నోటా' మూవీ తమిళంలో విడుదలవుతున్న నేపథ్యంలో.... విజయ్ దేవరకొండ అగ్రెసివ్ మార్కెటింగ్ నిర్వహించాలని మరో అభిమాని ట్విట్టర్ ద్వారా కోరారు. విజయ్ తొలి తమిళ సినిమా అక్కడ బ్లాక్ బస్టర్ విజయం అందుకోవాలని, తమిళనాట కూడా విజయ్ మార్కెట్ విస్తరించాలని ఆకాంక్షిస్తున్నారు.
విజయ్ దేవరకొండ హీరోగా స్టూడియో గ్రీన్ వారు నిర్మించిన 'నోటా' సినిమా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆనందర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ మూవీలో విజయ్ దేవరకొండ ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నారు.


Click it and Unblock the Notifications











