చెన్నై యువతపై విజయ్ దేవరకొండ ఎఫెక్ట్... టాప్ 3 పొజిషన్‌తో తమిళ స్టార్లకు షాక్!
విజయ్ దేవరకొండ తెలుగులో అతి తక్కువ కాలంలోనే సెన్సేషనల్ స్టార్‌గా ఎదిగారు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా చిత్రాల తర్వాత విజయ్ అంటే యూత్‌లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇందుకు కారణం కేవలం సినిమాలే కాదు... విజయ్ వ్యవహాశైలి, లైఫ్ స్టైల్ నుంచి యువత స్పూర్తి పొందడమే.
కేవలం హైదరాబాద్ యువతమీదే కాదు.. చెన్నై యూత్ మీద కూడా విజయ్ దేవరకొండ ప్రభావం పడటం చర్చనీయాంశం అయింది. తాజాగా చెన్నై టైమ్స్ విడుదల చేసిన మోస్ట్ డిజైరబుల్ మెన్ 2018 లిస్టులో విజయ్ దేవరకొండ టాప్ 3 పొజిషన్ దక్కించుకున్నాడు.

నెం.1 స్థానంలో అనిరుధ్
తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ చెన్నై టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2018 లిస్టులో నెం.1 స్థానం దక్కించుకున్నాడు. గతేడాది కూడా మొదటి స్థానంలో ఉన్న అనిరుధ్.. దాన్ని నిలబెట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు.

విజయ్ దేవరకొండ టాప్ 3
ఈ లిస్టులో విజయ్ దేవరకొండ నెం.3 పొజిషన్ దక్కించుకున్నాడు. ఎంతో మంది తమిళస్టార్లను వెనక్కి నెట్టి విజయ్ ఈ పొజిషన్ అందుకోవడం చర్చనీయాంశం అయింది. అతడు నటించిన ‘నోటా' మూవీ 2018లో అక్కడ విడుదలైన సంగతి తెలిసిందే.

టాప్ 10 స్టార్స్
-అనిరుధ్ రవిచందర్
-అధర్వా
-విజయ్ దేవరకొండ
-హరిష్ కళ్యాణ్
-శివ కార్తికేయన్
-ధనుష్
-శింబు
-దుల్కర్ సల్మాన్
-ఆది
-అరవ్

వెనకపడిపోయిన టాప్ స్టార్స్
మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్టులో తమిళ స్టార్ విజయ్ 25 స్థానంలో ఉన్నారు. చాలా మంది స్టార్స్ టాప్ 30లో చోటు దక్కించుకోక పోవడం గమనార్హం. టాప్ 30లో ఇంకా సిద్ధార్థ్(16), ఆర్య(18), జీవా(19), జయం రవి(12) తదితరులు ఉన్నారు.


Click it and Unblock the Notifications











