అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ ‘వర్మ’పై విజయ్ దేవరకొండ రియాక్షన్!
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తెలుగు మూవీ 'అర్జున్ రెడ్డి' తమిళంలో 'వర్మ' పేరుతో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ హీరోగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ తమిళ దర్శకుడు బాల దర్శకత్వంలో 'వర్మ' రూపొందుతోంది.
ప్రస్తుతం తన 'నోటా' సినిమా ప్రమోషన్లో భాగంగా చెన్నై వెళ్లిన విజయ్ దేవరకొండకు 'వర్మ' సినిమాకు సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తమిళ వెర్షన్ అర్జున్ రెడ్డి 'వర్మ' టీజర్ మీద మీ స్పందన ఏమిటని అడ్డగా..... ఈ టీజర్ చూస్తుంటే అర్జున్ రెడ్డి షూటింగ్ రోజులు గుర్తుకు వస్తున్నాయన్నారు విజయ్.

బాల సర్ సినిమాలు చాలా యూనిక్‌గా ఉంటాయి. ఆయన 'వర్మ' చిత్రాన్ని చాలా డిఫరెంటుగా తీస్తారనే నమ్మకం ఉంది. అలాగే ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం అవుతున్న ధృవ్‌కు విషెస్ తెలియజేస్తున్నట్లు విజయ్ దేవరకొండ వ్యాఖ్యానించారు.
పోల్: బిగ్‌బాస్ తెలుగు 2 విజేతను మీరే తేల్చేయండి.. మీ ఓటు వేసేందుకు లింక్ క్లిక్ చేయండి!
సెప్టెంబర్ 23న ధృవ్ పుట్టినరోజు సందర్భంగా 'వర్మ' ఫస్ట్ లుక్ టీజర్ లాంచ్ చేశారు. తెలుగు వెర్షన్ 'అర్జున్ రెడ్డి'కి సంగీతం అందించిన రాధన్ తమిళ వెర్షన్ 'వర్మ'కు సంగీతం అందిస్తున్నారు. తమిళంలో 'వర్మ' టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చినా..... 'అర్జున్ రెడ్డి' ఫీవర్లో ముగితేలిన తెలుగు వారికి మాత్రం 'వర్మ' టీజర్ అంతగా రుచించలేదు.
కాగా... విజయ్ దేవరకొండ నటించిన 'నోటా' అక్టోబర్ 5న తెలుగు, తమిళంలో విడుదల కాబోతోంది. పొలిటిక్ బ్యాక్ డ్రాపుతో రూపొందిన ఈ చిత్రంలో విజయ్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నారు. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించగా, కె.ఇ జ్ఞానవేల్ రాజా నిర్మించారు.


Click it and Unblock the Notifications











