హన్సిక బాత్రూంలోకి నాటీ హీరో దూరి..
హాట్ స్టార్ హన్సిక తన తాజా చిత్రం వేలాయుధం ప్రమోషన్ మొదలెట్టింది. అందులో భాగంగా ఆమె మాట్లాడుతూ...వేలాయుధం చిత్రం గ్రామీణ నేపధ్యంలో జరిగే కథ. నేను ఓ విలేజ్ అమ్మాయిగా కనిపిస్తాను. నేను బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు హీరో తన కోడిని వెతుక్కుంటూ బాత్రూమ్ లోకి దూరుతాడు. ఆ సీన్ చాలా ఫన్నీగా ఉంటుంది. నా అభిమానులకు ఈ సీన్ బాగా నచ్చుతుందని ఆసిస్తున్నాను అంది. ఇక వేలాయుధం చిత్రం తెలుగులో వచ్చిన అజాద్ కి రీమేక్. నాగార్జున చేసిన పాత్రను విజయ్ చేస్తున్నాడు. సౌందర్య పోషించిన పాత్రను జెనీలియా, శిల్పాశెట్టి పాత్రను హన్సిక చేస్తున్నారు. ఇళయదళపతి విజయ్ చిత్రాల్లోకెల్లా వేలాయుధం భారీ బడ్జెట్‌తో కూడుకుందని నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ అంటున్నారు. కమలహాసన్‌తో దశావతారం తర్వాత రవిచంద్రన్ నిర్మిస్తున్న చిత్రం వేలాయుధం.
ఈ చిత్రంలో విజయ్ సరసన జెనీలియా, హన్సిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. చెల్లెలి పాత్రలో శరణ్యమోహన్ నటిస్తున్నారు. జయం రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటిం గ్ పూర్తి చేసుకుంది. రవిచంద్రన్ చిత్ర విశేషాలు చెబుతూ దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కాశ్మీర్‌లో షూటింగ్ జరుపుకున్న తమిళ చిత్రం వేలాయుధం అని పేర్కొన్నారు. షాయాజి షిండే, రక్తచరిత్ర ఫేమ్ అభిమన్యుసింగ్ సహా 15 మంది ప్రతినాయకులు, 30 మంది హాస్యనటులు నటిస్తున్నారని వెల్లడించారు. ఉత్కంఠ భరిత పోరాట సన్నివేశాలను హాలీవుడ్ స్టంట్ మాస్టర్ టామ్ డెల్మార్ కంపోజ్ చేశారని తెలిపారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు.


Click it and Unblock the Notifications











