మీ హీరో మా హీరో బూట్లు నాకడానికి పనికిరాడు.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్.. చిచ్చు పెట్టిన లెజెండ్!

తమిళ సినిమా పరిశ్రమలో దిగ్గజ రచయిత స్వర్గీయ కరుణానిధి శత జయంతి ఉత్సవాలు అత్యంత వివాదంగా మారాయి. ఇటీవల చెన్నైలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్దగా స్పందన రాకపోవడం భారీ చర్చకు దారి తీసింది. తమిళ సీఎం స్టాలిన్ నేతృత్వంలో కొనసాగిన ఈ వేడుకకు జనం ముఖం చాటేయడంతో సోషల్ మీడియాలో హీరోల ఫ్యాన్స్ మధ్య వార్ భీకరంగా జరుగుతున్నది. సీనీ హీరోల అభిమానుల మధ్య జరుగుతున్న సోషల్ మీడియా యుద్దం వివరాల్లోకి వెళితే..

చెన్నైలో జరిగిన కరుణానిధి శత జయంత్రి ఉత్సవాలకు రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య, కార్తీ, ధనుష్, శివకార్తీకేయన్, శివ రాజ్‌కుమార్, నయనతార, కీర్తీ సురేష్, వడివేలు, జీవా, జయం రవి, పార్తీబన్ లాంటి ప్రముఖులు హాజరయ్యారు. అయితే విజయ్, అజిత్ ఈ వేడుకకు దూరంగా ఉన్నారు.

Vijay Fan target Rajinikanth amid Kalaignar 100 meet disaster

ఇక కరుణానిధి సంస్మరణ వేడుకకు సుమారు 50 వేల మందికి ఏర్పాట్లు చేశారు. అయితే ఈ కార్యక్రమానికి 1000 మంది కూడా కనిపించలేదనే వార్త మీడియాలో హైలెట్ అయింది. దాంతో స్టాలిన్ సర్కార్‌కు, నిర్వాహకులకు ఈ విషయం ఓ చేదు అనుభవంగా మారింది. డీఎంకే ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో విజయ్, అజిత్ అభిమానులు మా హీరోలు రాకపోవడం వల్లే ఈ సభ విఫలమైందని కామెంట్లు పెడుతున్నారు.

Vijay Fan target Rajinikanth amid Kalaignar 100 meet disaster

ఇదిలా ఉండగా.. హీరో సూర్యపై కూడా ఇతర హీరోల అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. సూర్య విలువలేదు. ఈయన కరుణానిధి సభకు వచ్చినా ఆయన అభిమానులు రాలేదు. అందుకే ఈ సభ దారుణంగా విపలమైంది అంటూ #WorthlessActorSuriya అనే ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఒక హీరో వర్గం ఫ్యాన్స్ మరో వర్గంపై ధ్వజమెత్తుతున్నారు. విజయ్ రాకపోవడం వల్ల ఆయన అభిమానులు రాలేదు. అందుకే ఈ సభ డిజాస్టర్ అయిందని పేర్కొంటున్నారు.

గతంలో కూడా విజయ్, అజిత్ ఫ్యాన్స్ మధ్య భారీగా గతంలో ట్రోల్స్ యుద్దం జరిగింది. ఫలానా హీరో చనిపోయడాని RIP అంటూ ఒక హీరో ఫ్యాన్స్, మరో ఫ్యాన్స్ ట్రోల్ చేసుకొన్నారు. అలాగే ఒక హీరో ఫ్యాన్స్ మరో హీరో ఫ్యాన్స్‌పై భౌతిక దాడులు కూడా జరిగాయి. తమిళ సినీ పరిశ్రమలో ఇలాంటి సంఘటనలు తరుచూ జరుగుతున్నడం సినీ వర్గాలను, హీరోలను ఆందోళనకు గురిచేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X