టీవీ ఛానెల్ పై స్టార్ హీరో ఫాన్స్ దాడి
తమ హీరో గురించి తప్పుగా టీవీ ఛానెల్ లో చర్చించారంటూ చెన్నైలోని విజయ్ ఛానెల్ పై దాడి జరిగింది. ఇంతకీ ఎవరా అంత గొప్ప ఫ్యాన్స్ ఉన్న హీరో ఎవరంటే అతను విజయ్. తమిళంలో నెంబర్ వన్ ప్లేసులో ఉన్న అతనికి అభిమానులు ఎక్కువే. మొన్న రాత్రి టీవీ ఛానెల్ లో నీయ నాన అనే పోగ్రాం వచ్చింది. అందులో విజయ్ లేటెస్ట్ చిత్రం కావలన్ గురించి చర్చ వచ్చింది. ఆ డిస్కషన్ లో వరసగా విజయ్ సినిమాలు ప్లాప్ అవటం, దాని కారణాలు, ఈ సినిమా ఏ రేజింలో ఉంటుంది అనే రకరకాల అంశాలు చర్చకు వచ్చాయి. దాంతో విజయ్ అభిమానులకు కాలింది. వెంటనే బ్లాగ్ ల ద్వారా, మెయిల్స్ ద్వారా, ఎస్.ఎమ్.ఎస్ ల ద్వారా విజయ్ ఛానెల్ ను క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేసారు. వారు పట్టించుకోకపోవటంతో స్వయంగా రంగంలోకి దిగి ముట్టడించారని సమాచారం. తమిళ సినీ పరిశ్రమలో ఎక్కడ విన్నా ఇదే హాట్ టాపిక్ గా వినపడుతోంది.


Click it and Unblock the Notifications











