twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కృష్ణగిరిలో విజయ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. విజిల్ సినిమా బీభత్సం!

    |

    తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'విజిల్'. ఇదే సినిమా తమిళ భాషలో బిగిల్ అనే పేరుతో ఈ రోజే (అక్టోబర్ 25న) విడుదలైంది. తెలుగు, తమిళ భాషల్లో హీరో విజయ్‌కి ప్రత్యేకమైన క్రేజ్ ఉండటంతో విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రీమియర్ షోస్, స్పెషల్ షో కోసం ఎగబడ్డారు విజయ్ ఫ్యాన్స్. అయితే థియేటర్ యాజమాన్యం స్పెషల్ షో వేయకపోవడంతో విజయ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. ఈ ఉదంతం తమిళనాడు లోని కృష్ణగిరిలో జరిగింది.

    ఫ్యాన్స్‌ కోసం ప్రత్యేకంగా బిగిల్ సినిమా ప్రదర్శించలేదని ఆగ్రహించిన విజయ్ అభిమానులు గత రాత్రి నానా రచ్చ చేశారు. కృష్ణగిరిలోని సినిమా హాల్‌ను ధ్వంసం చేయడంతో పాటు సమీపంలోని దుకాణాలకు నిప్పు పెట్టడంతో పరిస్థితి ఉదృతంగా మారింది. తమ హీరో సినిమా తమ హీరో సినిమాను ప్రదర్శించేవరకూ వెనక్కి తగ్గేది లేదంటూ ఆందోళనకు దిగారు విజయ్ ఫ్యాన్స్.

    Vijay Fans Worry with Theaters Management!

    దీంతో విషయం తెలుసుకున్న తమిళనాడు పోలీసులు.. రంగం లోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ మేరకు పోలీసులు లాఠీఛార్జ్‌ చేయడం జరిగింది. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా అలజడి సృష్టించిన 37 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం అందింది. విజయ్ ఫ్యాన్స్ ఈ రకమైన బీభత్సం సృష్టించడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

    భారీ అంచనాల నడుమ విడుదలైన బిగిల్ సినిమాలో విజయ్ తండ్రిగా, కొడుకుగా నటించాడు. నయనతార హీరోయిన్ గా నటించగా, ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. చూడాలి మరి ఈ సినిమాకు క్రిటిక్స్ ఏ విధమైన రేటింగ్స్ ఇస్తారా అనేది!.

    English summary
    Vijay Dalapathi new movie Bigil which is directed by Atlee Kumar. This is movie is released in telugu as Whistle. Today this movie released and getting possitive talk from audians.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X