హీరో విజయ్, అమలా పాల్ నిరాహార దీక్ష
తమిళనాడు మినహా అన్ని చోట్లా ఈ సినిమా విడుదలైంది. తెలుగులో 'అన్న' పేరు రిలీజైంది. దీంతో 'తలైవా' పైరసీ సీడీలు తమిళనాడులో మార్కెట్లోకి ప్రేవేశించాయి. ఈ చిత్ర నిర్మాత చంద్రప్రకాష్ జైన్ ముఖ్యమంత్రి జయలలితను కలిసి సినిమా విడుదలకు చర్యలు తీసుకోవాలని విన్నవించారు.
మరో వైపు చిత్రయూనిట్ సభ్యులు చెన్నై పోలీస్ కమీషనర్‌ను కలిసి ఒక లేఖ అందించారు. 'తలైవా' చిత్రం విడుదల కోసం హీరో విజయ్, సత్యరాజ్, హీరోయిన్ అమలా పాల్, ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం చెన్నైలో నిరాహార దీక్షకు దిగుతున్నారని, అందుకు అనుమతి ఇవ్వాలని ఆ లేఖలో పేర్కొన్నారు.
తలైవా స్టోరీ...ముంబైలోని ధారావి ప్రాంతంలో పేదలకు అండగా ఉండే డాన్ కథ. డాన్ మరణం తర్వాత అతని కొడుకు విదేశాల నుంచి వచ్చి తండ్రి బాటలో నడుస్తాడు. అయితే ఈ స్టోరీ ఎస్ఎస్ కందస్వామి, అతని కొడుకు ఎస్‌కె రామస్వామిలను పోలి ఉంటుందనే ఆరోపణలు ఉన్నాయి. దీన్ని ఆరోపిస్తూ కందస్వామికి మనవడు ఎస్‌కెఆర్ కర్ణన్ కోర్టుకెక్కారు. మాతాత, తండ్రి ఎలాంటి అండర్ వరల్డ్ కార్యకలాపాల్లో ఇన్వాల్వ్ కాలేదని, వారు ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో సాగారని ఎస్‌కెఆర్ కర్ణన్ అంటున్నారు.


Click it and Unblock the Notifications












