ఆ స్టార్ హీరో రాజకీయాల్లోకి వస్తాడని పొలిటీషయన్స్ భయం
తమిళ హీరో విజయ్ రాజకీయాల్లోకి రావడం ఖాయమేనని, అయితే వెంటనే రాకపోవచ్చునని ఆయన తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్‌ఏ.చంద్రశేఖరన్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయ్ రాజకీయాల్లోకి రావాలని అభిమానులు కూడా కోరుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయ్ అన్నాడీఎంకే పార్టీకి ప్రచారం చేస్తారనే వార్తలపై ప్రశ్నించగా వెంటనే ఆయన రాజకీయాల్లోకి రావడం ఉండదన్నారు. సినీనటులు రాజకీయాల్లోకి రావడం చూసి కొంత మంది రాజకీయ నాయకులు భయపడుతున్నారని తెలిపారు. వారి స్థానాలకు ముప్పు వాటిల్లుతుందనే ఆవేదన చెందుతున్నారని అన్నారు. ఎంజీఆర్ లాంటి నటులు రాజకీయాల్లోకి వస్తే రాజకీయ నాయకులు భయపడడంలోఅర్థం ఉంటుం దని, విజయ్ లాంటి వారు వస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. అలాగే కొంత మంది విజయ్ నటించిన కావలన్ చిత్రాన్ని విడుదల కానివ్వకుండా చేశారని ఆరోపించారు. సంక్రాంతికి విడుదల కాదనే ప్రచారం చేశారని, అభిమానులు పోస్టర్లు అంటిస్తుండగా అడ్డుకున్నారని తెలిపారు. కావలన్‌లో రాజకీయాలకు సంబంధించిన పంచ్ డైలాగులు లేవని, అది ప్రేమకథా చిత్రమని వివరించారు. అభిమానులు నాలుగేళ్ల నుంచి విజయ్ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారని తెలి పారు.


Click it and Unblock the Notifications











