బీజేపీ వైపు విజయ్ అడుగులు.. అసలు నిజాన్ని బయటపెట్టిన తండ్రి

కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో భవిష్యత్తు రాజకీయ నాయకులు చాలా మంది ఉన్నారనే చెప్పాలి. రెగ్యులర్ పొలిటీషియన్స్ ఎంత మంది ఉన్నా కూడా నటీనటుల పొలిటికల్ కెరీర్ కి అక్కడ పెద్దగా పోటీ ఉండదనే చెప్పాలి. అందుకే చాలా వరకు అక్కడ హీరోలు వీలైనంత వరకు జనాలకు చాలా దగ్గరగా ఉండేందుకు ప్రయత్నం చేస్తారు. ఇక త్వరలోనే తమిళ రాజకీయాల్లో ఇళయదలపతి విజయ్ కూడా చక్రం తిప్పబోతున్నట్లు టాక్ వస్తోంది. ఇక ఇటీవల విజయ్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు కథనాలు రావడంతో విజయ్ తండ్రి వివరణ ఇచ్చారు.

ఆ విషయంలో విజయ్ నెంబర్ వన్

ఆ విషయంలో విజయ్ నెంబర్ వన్

ప్రస్తుతం విజయ్ తమిళనాడు అత్యదిక మార్కెట్ ఉన్న హీరోల్లో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడనే చెప్పాలి. వరుసగా ఆయన సినిమాలు మూడు వందల కోట్ల బిజినెస్ చేశాయి అంటే అభిమానుల సంఖ్య ఏ రేంజ్ లో ఉందొ అర్థం చేసుకోవచ్చు. పైగా విజయ్ ఎంచుకుంటున్న కథలు కూడా సందేశాన్ని అందించేలా ఉంటున్నాయి. ఇక గతంలో విజయ్ సన్నిహితులు కూడా ఆయన రాజకీయాల వైపు అడుగులు వేసే అవకాశం లేకపోలేదని అన్నారు.

విజయ్ మరో పార్టీలోకి చేరబోతున్నాడా..?

విజయ్ మరో పార్టీలోకి చేరబోతున్నాడా..?

పలుమార్లు విజయ్ తండ్రి కూడా పాలిటిక్స్ లోకి తన కుమారుడు వస్తాడని కూడా అనడంతో ఒక్కసారిగా ఆయన అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఆయన కొత్త తరహా పార్టీ పెట్టబోతున్నట్లు టాక్ వస్తోంది. ఏవైనా విపత్తులు వచ్చినప్పుడు కూడా విజయ్ తన అభిమానుల ద్వారా సహాయం చేయిస్తున్నట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే ఇప్పుడు తమిళ మీడియాలో విజయ్ మరో పార్టీలోకి చేరబోతున్నట్టు వార్తలు రావడంతో అభిమానులు షాక్ అయ్యారు.

క్లారిటీ ఇచ్చినా విజయ్ తండ్రి

క్లారిటీ ఇచ్చినా విజయ్ తండ్రి

తమిళ జనాలు నేషనల్ పార్టీలపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపరని అందరికి తెలిసిన విషయమే. అయితే భారత జనతా పార్టీ వైపు విజయ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు బాగా రూమర్స్ వైరల్ అయ్యాయి. ఈ విషయంపై విజయ్ తండ్రి చంద్రశేఖర్ వెంటనే వివరణ ఇచ్చారు. తనకు గత కొన్ని రోజులుగా ఇదే విషయంపై ఫోన్లు వస్తున్నాయని, విజయ్ ఏ పార్టీలో చేరడం లేదని ఆయన అఫీషియల్ గా వివరణ ఇవ్వడంతో క్లారిటీ వచ్చేసింది.

Recommended Video

Hero Raj Tarun Talks About Co-Stars In Orey Bujjiga Movie
విజయ్ రాజకోయల్లోకి ఎప్పుడు వస్తాడో..

విజయ్ రాజకోయల్లోకి ఎప్పుడు వస్తాడో..

ఇటీవల బీజేపీ పార్టీ వైపు సీనియర్ నటి కుష్బూ యూ టర్న్ తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేషనల్ పార్టీ తమిళ రాజకియల్లో తన బలాన్ని మరింత పెంచుకోవాలని చూస్తోంది.ఇక బీజేపీ పార్టీని మరింత బలోపేతం చేయడానికి విజయ్ కూడా సిద్ధమైనట్లు టాక్ రావడంతో ఫైనల్ గా అవన్నీ అబద్దాలని తెలిసిపోయాయి. మరి విజయ్ తన రాజకీయ భవిష్యత్తుపై ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో తెలియాలి అంటే మరికొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X