స్టార్‌హీరో సాంగ్ లీక్, పోలీస్ కమీషనర్‌కు ఫిర్యాదు
చెన్నై : తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తమిళ చిత్రం 'తలైవా'లోని ఓసాంగు ఇంటర్నెట్లో లీకైంది. దీంతో ఖంగు తిన్న దర్శక నిర్మాతలు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఎంతో కీలకమైన ఈ పాటను ప్రత్యేకంగా విడుదల చేయాలనుకున్నారు. కానీ అనుకోని విధంగా ఇది బయటకు లీకైంది.
సాంగ్ లీక్ నేపథ్యంలో 'తలైవా' దర్శకుడు ఎ.ఎల్ విజయ్ చెన్నై పోలీస్ కమీషనర్ ఆఫీసును వెళ్లి ఫిర్యాదు చేసారు. తన ఫిర్యాదులో ఆయన....తమ అనుమతి లేకుండా సాంగును దొంగించి చట్టవిరుద్దంగా ఇంటర్నెట్లో అప్ లోడ్ చేసిన వారిని గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ రేంజిలో హడావుడి చేయడానికి కారణం....ఈ పాట పాడింది హీరో విజయ్ కావడమే.
తలైవా చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తయింది. చిత్ర ఆడియోను హీరో విజయ్ పుట్టిన రోజును పురస్కరించుకుని జూన్ 22న విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ లోపే స్వయంగా విజయ్ పాడిన పాట బయటకు లీక్ కావడం యూనిట్ సభ్యులను అసంతృప్తికి గురి చేసింది.
'తలైవా' చిత్రాన్ని చంద్రప్రకాష్ జైన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అమలా పాల్, రాగిని నంద్విని, సంతానం, సురేష్, రాజీవ్ పిల్లై, అభిమన్యు సింగ్, ఉదయా, తంబి రామయ్య, మనో బాల తదితరులు నటిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆగస్టు నెలలో ఈ తమిళ చిత్రం విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











