పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కనెక్ట్ అయిపోయారు.. లాభాల పంట, తెలుగులో ఎట్టకేలకు!

ఇలయదళపతి విజయ్ నటించిన సర్కార్ చిత్రం సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ చిత్రానికి ఆరంభంలో కొంత డివైడ్ టాక్, క్రిటిక్స్ నుంచి విభిన్నమైన రివ్యూలు వచ్చాయి. అదే సమయంలో వివాదాలు ఈ చిత్రాన్ని వెంటాడాయి. తమిళంలో విజయ్ తిరుగులేని స్టార్ హీరో. రజని తరువాత అంతటివాడు అంటూ సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇంతటి స్టార్ డమ్ ఉన్న విజయ్ స్టామినాతో తమిళంలో విభిన్నమైన పరిస్థితులని ఎదుర్కొని నిలబడడంలో ఆశ్చర్యం లేదు. కానీ ఈ చిత్రం తెలుగులో కూడా అద్భుత వసూళ్లు రాబడుతూ అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.

చాలా తక్కువగా

చాలా తక్కువగా

విజయ్ తన చిత్రాలని చాలా తక్కువగా తెలుగులోకి డబ్ అవుతూ ఉంటాయి. గతంలో డబ్ అయిన విజయ్ చిత్రాలు ఇక్కడ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీనితో విజయ్ కు తెలుగులో సరైన మార్కెట్ లేదు. సర్కార్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ ఈ చిత్ర తెలుగు వర్షన్ హక్కులు కేవలం 7 కోట్లకు మాత్రమే అమ్ముడయ్యాయి. అది కూడా తెలుగులో మురుగదాస్ కు ఉండే క్రేజ్ వలన.

తట్టుకుని నిలబడి

తట్టుకుని నిలబడి

సర్కార్ చిత్రం నలువైపుల నుంచి వస్తున్న రాజకీయ విమర్శలని తట్టుకుని నిలబడి సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. మురుగదాస్ ఆసక్తికరమైన పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినప్పటికీ సెకండ్ హాఫ్ పై కాస్త నెగిటివ్ రివ్యూలు వినిపించాయి. డివైడ్ టాక్ ప్రభావం తెలుగులో కూడా ఉంటుందని అంతా భావించారు.

ఆశ్చర్యకరంగా

ఆశ్చర్యకరంగా

తాజాగా ఈ చిత్ర తెలుగు వర్షన్ వసూళ్లు చూస్తే ఆశ్చర్యపోవలసిందే. తొలివారం ముగియకముందే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కు చేరువైపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్కార్ చిత్రం 6 కోట్లకు పైగా షేర్ రాబట్టడం విశేషం. ఈ స్థాయిలో విజయ్ చిత్రం తెలుగులో కలెక్షన్స్ రాబట్టడం ఇదే తొలిసారి.

కనెక్ట్ అయిపోయారు

కనెక్ట్ అయిపోయారు

తెలుగులో సర్కార్ ఈ స్థాయి విజయానికి ఓ కారణం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ కు సరిపోయే కథ కావడంతో ఆయన అభిమానులు ఈ చిత్రానికి కనెక్ట్ అయిపోయారు. కొన్ని సన్నివేశాల్లో అయితే విజయ్ నటన పవన్ ని పోలిఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎలాగైతేనేం.. ఇలయదళపతి విజయ్ ఎట్టకేలకు తెలుగులో తొలి హిట్ సొంతం చేసుకున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X