లాక్ డౌన్‌లో విజయ్ ఫ్యాన్స్ ఖుషీ.. దళపతి మేనియా మామూలుగా లేదే!
కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో ప్రజలంతా ఇంటి పట్టునే ఉండాలని ప్రభుత్వాలు
సూచిస్తున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించారు. రోడ్ల మీదకు ప్రజలెవరూ రావొద్దని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే కొంతమంది లాక్ డౌన్‌ను కష్టంగా భావిస్తుంటే.. మరికొందరు ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా దళపతి విజయ్ ఫ్యాన్స్ నేడు ఫుల్ ఖుషీగా ఉన్నారంట. ఆ సంగతేంటో ఓ సారి చూద్దాం.
దళపతి విజయ్‌ను స్టార్ హీరోగా నిలబెట్టిన సినిమాల్లో గిల్లీ ఒకటి. ఒక్కడు సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్, త్రిష, ప్రకాశ్ రాజ్ నటించారు. ఈ సినిమా కోలీవుడ్‌లో అప్పటి వరకు ఉన్న రికార్డులన్నంటినీ బద్దలు కొట్టేసింది. ఈ చిత్రంలో విజయ్ తిరుగులేని హీరోగా ఎదిగాడు. అయితే ఈ సినిమాను బుల్లితెరపై ఎన్నిసార్లు ప్రసారం చేసినా ఓ సంచలనమే.

తాజాగా లాక్ డౌన్ నెలకొని ఉన్న ఈ పరిస్థితిలో గిల్లీ సినిమాను ప్రసారం చేశారు. విజయ్ ఫ్యాన్స్ దెబ్బకు ఇది ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చింది. నేషనల్ వైడ్‌గా టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. లాక్ డౌన్ సమయంలో మాకు ఎంతో ఇష్టమైన రోజంటూ విజయ్ ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. సినిమా చూస్తున్న పిక్స్‌ను షేర్ చేస్తూ హల్చల్ చేస్తున్నారు. ఇక ఇది చూసిన నెటిజన్స్ విజయ్ క్రేజ్‌ను చూసి షాక్ అవుతున్నారు.



Click it and Unblock the Notifications











