యూనిట్ సభ్యులకు హీరో బంగారు గొలుసుల నజరానా

By Sindhu

వేలాయుధం చిత్ర సాంకేతిక వర్గానికి ఆ చిత్ర హీరో విజయ్ బంగారు గొలుసులను అందించారు. ఆస్కార్ రవిచంద్రన్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి జయం రాజ దర్శకుడు. విజయ్, జెనీలియా, హన్సిక నటిస్తున్నారు. చెల్లెలి పాత్రలో శరణ్యమోహన్ నటిస్తున్నారు. ఈ చిత్రం దాదాపు పూర్తి అయింది. దీపావళికి విడుదల కానుంది.

ఈ చిత్రం క్లైమాక్స్ సన్నివేశాలను ఇటీవల విజయ్ చూశారట. చాలా గొప్పగా వచ్చాయని ఆనందం వ్యక్తం చేశారట. పక్కనున్న దర్శకుడు జయం రాజాను, కెమెరామన్ ప్రియన్‌ను కౌగిలించుకున్నారట. ఈ చిత్రానికి పనిచేసిన సాంకేతిక వర్గానికి కాసు బంగారు గొలుసులను బహుమతిగా అందించారు. వేలాయుధం చిత్రానికి హీరో విజయ్ హైలెట్ అని దర్శకుడు జయం రాజా అంటున్నారు.విజయ్ చిత్రాల్లో బెస్ట్ క్లైమాక్స్‌ గా ఇది నిలిచిపోతుందని జయం రాజా అంటున్నారు.

ఈ చిత్రంలో మరొకొన్ని హైలెట్స్ ఏంటంటే కోటిన్నర రూపాయల ఖర్చుతో వివాహ వేదిక సెట్, గ్రామమంతా తోరణాలు కట్టి, సీరియల్ లైటింగ్‌తో అలంకరించి చిత్రీకరించిన సన్నివేశాలు ఒక హైలెట్. చిత్రం కోసం ఆ ఊరిలో ఒక పెద్ద బావిని తవ్వి చిత్రీకరణ పూర్తి అయిన తర్వాత వారికి బహుమతిగా ఇచ్చాం. హీరో ఇంట్రడక్షన్ సాంగ్ మరో హైలెట్. తిరుమూర్తి మలై ప్రాంతంలో చిత్రీకరించిన ఈ పాటకు అశోక్‌రాజ్ నృత్య దర్శకత్వం వహించా రు. 200 మందికి పైగా గ్రామీణ కళాకారులు, 150 మంది విదేశీ డ్యాన్సర్లు పాల్గొన్నారు. ఈ పాట చిత్రీకరణకు రెండు కోట్లకు పైగా నిర్మాత రవిచంద్రన్ ఖర్చు చేశారని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X