»   » వంద కోట్లు హీరోను... రాజకీయాల్లోకి రాకుండా దెబ్బతీస్తున్నారా?

వంద కోట్లు హీరోను... రాజకీయాల్లోకి రాకుండా దెబ్బతీస్తున్నారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తమిళనాట హీరో విజయ్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన సినిమాలకు రూ. 100 కోట్లు వసూలయ్యే సత్తా ఉంది. విజయ్ నటిస్తున్న 'తేరి' చిత్రం రేపు(ఏప్రిల్ 14) విడుదలకు సిద్దం అవుతున్న తరుణంలో కొత్తగా సమస్యలు వచ్చి పడ్డాయి.

ఉన్నట్టుండి ఈ చిత్రాన్ని ప్రదర్శించబోమంటూ థియేటర్‌ యజమానులు ప్రకటించడంతో విడుదలపై నీలినీడలు కమ్ముకున్నాయి. సినిమా థియేటర్లలో అధిక టిక్కెట్‌ ధరలపై హైకోర్డు కొరఢా ఝుళిపించిన నేపథ్యంలో వీరు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డిస్ర్టిబ్యూటర్లు తమతో మళ్లీ ఒప్పందం చేసుకుంటేనే సినిమా ప్రదర్శిస్తామని...టికెట్ రేట్లు తగ్గించిన నేపథ్యంలో ముందుగా అనుకున్న ఫైనాన్షియల్ ఒప్పందం ప్రకారం విడుదల చేయలేమని, అలా చేస్తే తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని చెన్నై, చెంగల్పట్టులోని సింగిల్‌, డబుల్‌ థియేటర్‌ యజమానులు ప్రకటించారు.

Vijay is eyeing politics after Theri?

అయితే థియేటర్ల ఓనర్లు ఉన్నట్టుండి ఇలా మెలికి పెట్టడం వెనక రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని ఆయన అభిమానులు వాదిస్తున్నారు. తమిళనాడులో అధికారంలో ఉన్న జయలలిత ప్రభుత్వానికి, విజయ్‌కి కొంతకాలంగా పడటం లేదనే వాదన ఉంది. ఈ కారణంగానే ఆయన సినిమాల విడుదల సమయంలో ఏదో ఒకరకంగా ఇలాంటి ఇబ్బందులకు గురి చేస్తూ తెర వెనక రాజకీయం నడిపిస్తున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి.

విజయ్ గత చిత్రాలు'తలైవా', 'పులి' చిత్రాల విడుదల సమయంలోనూ ఇబ్బంది పెట్టారు. ఇపుడు 'తేరి' విషయంలో కూడా అదే జరుగుతోంది. తేరి తర్వాత విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారనే ప్రచారం కూడా కొంతకాలంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకునేందుకే ఇలాంటి ఇబ్బందులు పెడుతున్నారనే వాదన కూడా ఉంది.

Vijay is eyeing politics after Theri?

"తెరి" చిత్రం తెలుగు లో "పోలీసోడు" అనే టైటిల్ తో విడుదల కానుంది. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమం విజయవంతం గా పూర్తి చేసుకుని, U సర్టిఫికేట్ ను దక్కించుకుంది. 'రాజా రాణి' చిత్రం తో మంచి పేరు సంపాదించుకున్న అట్లి దర్శకత్వం లో ముస్తాబవుతోన్న ఈ చిత్రం పై భారీ ఆశలు ఉన్నాయి.భారీ వ్యయం తో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని అట్లి తెరకెక్కించారు.

విజయ్ , సమంత, అమీ జాక్సన్, ప్రభు, రాధిక, మహేంద్రన్ వంటి ప్రముఖ నటులు ఈ చిత్రం లో ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. దర్శకత్వం - స్క్రీన్ప్లే - అట్లి .ఫోటోగ్రఫీ - జార్జ్ సి విలియమ్స్ . ఎడిటర్ -అన్తోనీ రుబెన్ . సంగీతం - జి . వి . ప్రకాష్ కుమార్. ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్ : సతీష్ , సహా నిర్మాతలు - శిరీష్ , లక్ష్మణ్. నిర్మాతలు - రాజు , కలయిపులి ఎస్ థాను.

English summary
All eyes in Tamil Nadu are on Theri, as it gets ready for a release at a ... the last few years there have been rumours that Vijay is eyeing politics.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu