జయలలిత వారసుడు అజిత్ కాదు.. అంతా రహస్యంగా ప్లాన్ చేస్తున్న విజయ్, త్వరలో సంచలనం!

సినిమా, రాజకీయాలని వేరు చేసి చూడలేం. రాజకీయాల్లో ప్రభావం చూపిన సినీప్రముఖులు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా సౌత్ లో. ఎంజీఆర్ మొదలుకుని ఎన్టీఆర్, జయలలిత వంటి సినీదిగ్గజాలు రాజకీయాల్లో రాణించారు. తమిళనాడులో సినీ ప్రముఖులే రాజకీయాల్ని శాసిస్తున్నారు. ఇటీవల మరణించిన కరుణానిధి కూడా సినీ నేపథ్యం ఉన్నా వ్యక్తే. ఇదిలా ఉండగా జయ మరణం తరువాత తమిళ రాజకీయాల్లో అనిశ్చితి ఏర్పడిన మాట వాస్తవం. త్వరలో తమిళ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించే చర్యలు జరగబోతున్నాయని వార్తలు వస్తున్నాయి.

 రజనీ, కమల్

రజనీ, కమల్

కమల్, రజనీకాంత్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ క్రియాశీలక రాజకీయాల్లో మాత్రం పాల్గొనడం లేదు. ప్రస్తుతం వీరు సినిమాలు చేసుకుంటూ రాజకీయ పరిస్థితులని గమనిస్తున్నట్లు తెలుస్తోంది.

 అమ్మ వారసుడు

అమ్మ వారసుడు

జయలలిత తమిళనాట మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్. ఆమె మరణంతో తమిళ రాజకీయాల్లో అనిశ్చితి నెలకొంది. జయమరణించిన సమయంలో ఆమె వారసుడు స్టార్ హీరో అజిత్ అంటూ కూడా చిన్నపాటి అలజడి చెలరేగింది. కానీ అజిత్ రాజకీయాల వైపు చూడడం లేదు.

దళపతి ప్లానింగ్

దళపతి ప్లానింగ్

అమ్మ వారసత్వాన్ని అందిపుచ్చుకోవడానికి మరో స్టార్ హీరో దళపతి విజయ్ రహస్యంగా ప్లాన్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. విజయ్ కొత్త పొలిటికల్ పార్టీ స్థాపించడానికి సీక్రెట్ గా ప్లాన్ చేస్తున్నట్లు తమిళనాట గుసగుసలు వినిపిస్తున్నాయి.

 సినిమాలతో

సినిమాలతో

విజయ్ కు ఉన్న మాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవల విజయ్ నటించిన ప్రతి చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సునామి సృష్టిస్తోంది. మెర్సల్ చిత్రం విడుదలై ఘనవిజయం సాధించింది. విమర్శలు కూడా వచ్చాయి. ఆ సమయంలో విజయ్ తండ్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ తన కుమారుడితో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు.

నెమ్మదిగా

నెమ్మదిగా

ప్రస్తుతం విజయ్ మురుగదాస్ దర్శత్వంలో సర్కార్ చిత్రంలో నటిస్తున్నాడు. సినిమాల్లో నటిస్తూనే పొలిటికల్ పార్టీ లీడ్ చేయడానికి అవసరమైన మెళుకువలు నేర్చుకుంటున్నాడట. ఏది ఏమైనా తమ అభిమాన నటుడు భవిష్యత్తులో రాజకీయాల్లో రావడం ఖాయం అని విజయ్ ఫాన్స్ అభిప్రాయ పడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X