Jana Nayagan: విజయ్‌ 'జననాయగన్‌'కు ఊరట..కోర్టు కీలక ఆదేశాలు.. విడుదల ఎప్పుడంటే?

Jana Nayagan: తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay) , హెచ్​. వినోద్​ కాంబోలో తెరకెక్కిన మూవీ జన నాయగక్ (Jana Nayagan)కు ఎట్టకేలకు ఊరట లభించింది. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా జనవరి 9న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన మూవీకి సెన్సార్​ రూపంలో కష్టాలు ఎదురయ్యాయి. ఈ విషయంపై మూవీ మేకర్స్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు.దీంతో ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు (Madras High Court)సెన్సార్ బోర్డును కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం కీలక తీర్పు వెలువడింది.

విజయ్ కు జంటగా పూజ హెగ్దే నటించనున్నారు. వీరితో పాటు గౌతమ్​ వసుదేవ్​ మీనన్​, మమితా బైజు, ప్రకాశ్​ రాజ్​, సునీల్​, ప్రియమణి, నారాయణ్ కీలక పాత్రలో నటించారు. ఈ భారీ బడ్డెట్ మూవీలో బాబీ డియోల్​ విలన్​ పాత్రలో పోషించనున్నారు. అంతే కాక ఈ సినిమా ఫుల్​ యాక్షన్‌ థ్రిల్లర్‌ జాన్రాలో తెరకెక్కించారు. ఈ సినిమాను కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్​పై వెంకట్‌ కె.నారాయణ నిర్మించారు.విజయ్ చివరి సినిమా ఇదే అన్న ప్రచారం నేపథ్యంలో, ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.

Vijay Jana Nayagan Gets Relief Madras High Court Directs CBFC to Grant U A Certificate

అయితే.. గత డిసెంబరులో 'జన నాయగన్' సినిమాను సెన్సార్ కోసం పంపినప్పుడు, కొన్ని సన్నివేశాలు తొలగించాలని, కొన్ని డైలాగ్స్ మ్యూట్ చేయాలని బోర్డు సూచించినట్లు సమాచారం. ఆ సూచనల మేరకు మార్పులు చేసిన నిర్మాతలు సినిమాను మళ్లీ సెన్సార్‌కు పంపించారు. కానీ, బోర్డు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది.

నిర్మాతల తరఫున దాఖలైన అత్యవసర పిటిషన్‌ దాఖాలు చేశారు. ఈ పిటిషన్ లో తొలుత సినిమాకు U/A సర్టిఫికెట్ ఇవ్వాలని సిఫార్సు చేసిన సెన్సార్ బోర్డు, ఆ తర్వాత అనూహ్యంగా సినిమాను రివ్యూ కమిటీకి పంపిందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం బుధవారం తీర్పును రిజర్వ్ చేసింది. ఇక ఈ వివాదంపై మద్రాస్ హైకోర్టు నేడు (శుక్రవారం) కీలక నిర్ణయం వెలువరించింది. సింగిల్ జడ్జి తన తీర్పులో.. 'ముందుగా U/A సర్టిఫికెట్ ఇవ్వాలని నిర్ణయించిన తర్వాత మళ్లీ రివ్యూ కమిటీకి పంపాల్సిన అవసరం ఏమిటి?' అని ప్రశ్నించారు. ముందుగా ఇస్తామని చెప్పిన U/A సర్టిఫికెట్‌ను తక్షణమే జారీ చేయాలని సెన్సార్ బోర్డుకు ఆదేశాలు ఇచ్చారు.

అప్పీల్‌కు వెళ్లిన సెన్సార్ బోర్డు
అయితే సింగిల్ జడ్జి తీర్పుపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) అప్పీల్‌కు వెళ్లింది. మద్రాసు హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం ముందు అత్యవసర విచారణ కోరుతూ రిట్ పిటిషన్ దాఖలు చేసింది. అయినప్పటికీ తాజా పరిణామాలతో 'జన నాయగన్' విడుదలకు మార్గం సుగమమైనట్లు చిత్ర వర్గాలు భావిస్తున్నాయి.

సంక్రాంతికి రిలీజ్ ప్లాన్?
ఈ కేసు కారణంగా జనవరి 9న విడుదల కావాల్సిన 'జన నాయగన్' వాయిదా పడింది. తాజా కోర్టు తీర్పుతో సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయ్యిందని సమాచారం. సంక్రాంతి కానుకగా జనవరి 14న సినిమాను థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మొత్తానికి, కోర్టు తీర్పుతో 'జన నాయగన్'కు ఊరట లభించగా, విడుదల తేదీపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X