కాజల్ హీరోయిన్ గా.. మోహన్‌లాల్ కీ రో ల్ లో...
చెన్నై : కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కీ రోల్ లో విజయ్ హీరోగా రూపొందనున్న చిత్రం ప్రారంభం ఘనంగా జరిగింది. ఆర్‌బీ చౌదరి నిర్మాణ సారథ్యంలో విజయ్ హీరోగా నేశన్ తెరకెక్కించనున్న చిత్రం 'జిల్లా'. ఈ చిత్ర ప్రారంభోత్సవం సోమవారం టీనగర్‌లోని ఆర్‌బీ చౌదరి కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా మోహన్ లాల్ తో కలిసి నటించనుండటం ఆనందంగా ఉందని ఇలయ తలబది విజయ్ అన్నారు. విజయ్‌తోపాటు ఆర్‌బీ చౌదరి, ఆయన ఇద్దరు కుమారులు జిత్తన్ రమేష్, జీవా, సంగీత దర్శకుడు డి.ఇమాన్, పూర్ణిమ భాగ్యరాజ్, విజయ్ తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు
ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో మోహన్‌లాల్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని చెప్పారు. ఆర్‌బీ చౌదరి నిర్మాతగా గతంలో పూవే ఉనక్కాగ, తుళ్లాద మనముం తుళ్లుం, లవ్‌టుడే, తిరుప్పాచ్చి వంటి విజయంతమైన చిత్రాల్లో నటించానని చెప్పారు. 'జిల్లా' కూడా అదే ఫలితాన్ని ఇస్తుందని దీమా వ్యక్తం చేశాడు. ఇందులో విజయ్‌కు జంటగా కాజల్ అగర్వాల్ నటించనుంది. పూర్ణిమ భాగ్యరాజ్, తంబి రామయ్య, మహత్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
గత ఏడాది 'తుపాకి' ఇచ్చిన ఉత్సాహంతో ప్రస్తుతం 'దైవతిరుమగళ్' ఫేమ్ విజయ్ దర్శకత్వంలో 'తలైవా'లో నటిస్తున్నాడు. కమల్ హాసన్ మద్దతుగా 'విశ్వరూపం' విడుదల వరకు చిత్రీకరణను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. మరోవైపు విజయ్ కొత్త చిత్రానికి రంగం సిద్ధమైంది. తుపాకి చిత్రం కూల్ హిట్ అని.. వంద కోట్లు దాటినా తన మాస్ అభిమానులను అలరించాలంటే ఇలాంటి చిత్రాలను చేయాల్సిందే అంటున్నారు విజయ్.
'గుమ్కీ' విజయంలో కీలకపాత్ర పోషించిన సంగీత దర్శకుడు డి.ఇమాన్ స్వరాలు సమకూర్చనున్నాడు. నేశన్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించనున్నాడు. మే మొదటి వారంలో సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు. ప్రస్తుతం కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సూపర్‌గుడ్ ఫలింస్ కోసం విజయ్ తన పారితోషికాన్ని కొంచెం తగ్గించుకున్నాడని సమాచారం.


Click it and Unblock the Notifications











