కాజల్, విజయ్ ‘తుపాకి’ ఫస్ట్ లుక్
తమిళ హీరో విజయ్, కాజల్ జంటగా రూపొందుతున్న చిత్రానికి తెలుగులో 'తుపాకి' అనే టైటిల్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ లీకైంది. మురగదాస్ తన పంథాకు భిన్నంగా ఫుల్ లెన్త్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా దీన్ని రూపొందిస్తున్నారు. హేరిష్ జైరాజ్ సంగీతం అందిస్తున్న ఈచిత్రానికి సంతోష్ శివన్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు.
ఓ చిన్న గ్రామం నుంచి ముంబయ్ వెళ్లి అక్కడ డాన్ అవతారమెత్తిన ఓ యువకుడి కథ ఈ సినిమా. తమిళంలో ' మాళై నీరతు మళియతుల్లి" అనే టైటిల్ తో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ భారీ చిత్రాన్ని విజయ్ తండ్రి ఎస్ఎ చ్రందశేఖర్ నిర్మిస్తుండటం విశేషం. మురుగదాస్‌కున్న క్రేజ్, కాజల్‌కు ఉన్న ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేస్తున్నారు.
అయితే తుపాకి టైటిల్‌పై వివాదం కూడా ఉంది. ' తుపాకి' పేరును గతేడాది జూన్ 30న ఫిల్మ్ చాంబర్ లో రిజిస్టర్ చేశామని దర్శకుడు జింకా హరీష్ బాబు అంటున్నారు. ఇటీవల కొన్ని దిన పత్రికల్లో, టీవీ ఛానల్స్ లో ప్రముఖ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో కాజల్, విజయ్ జంటగా తమిళంలో రూపొందుతున్న 'మాళైవీరతు మళియతుల్లి' సినిమా తెలుగులో 'తుపాకి' పేరుతో అనువదించి రిలీజ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
అయితే ఈ 'తుపాకి' టైటిల్ ఎవరికీ ఇవ్వలేదని, తనను ఎవరూ సంప్రదించలేదన్నారు. తమ చిత్రం ఉగ్రవాదం నేపథ్యంలో ఉంటుందని, అందుకు సంబంధించి స్టోరీ, పాటలు, కొంతమంది ఆర్టిస్టులను ఎంపిక చేయటం కూడా జరిగిందన్నారు. ఈ 'తుపాకి' టైటిల్ ను ఫిల్మ్ చాంబర్ వారు ఎలా అనుమితి ఇచ్చారో తెలియదని దర్శకుడు జింకా హరీష్ బాబు ఆ మధ్య ఓ ప్రకటన చేశారు.


Click it and Unblock the Notifications











