లియో సినిమాకు తెలుగులో మరింత పెరిగిన డిమాండ్.. రేటు ఎంతంటే?
ఇళయ దళపతి విజయ్ ప్రస్తుతం లోకేష్ కనగరాజు దర్శకత్వంలో లియో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్టుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. మూవీలో విజయ్ కి జోడిగా స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. లోకేష్ యూనివర్స్ లో భాగంగానే లియో సినిమాని కూడా సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరిస్తున్నారు.
మాఫియా బ్యాక్ డ్రాప్ కథాంశంతో ఈ మూవీ ఉండబోతుందని కోలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తున్న మాట. ఇప్పటికే ఈ సినిమాపై తమిళనాడులో భారీ హైప్ క్రియేట్ అయ్యి ఉంది. కచ్చితంగా విజయ కెరీర్ లో బ్లాక్ బస్టర్ మూవీగా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. లోకేష్ కెరియర్ లో ఇప్పటివరకు చేసిన నాలుగు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.

ఈ నేపథ్యంలో లియో చిత్రంపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా యొక్క డిజిటల్ రైట్స్ సుమారు 150 కోట్లకు పైగా పలికాయనే టాక్ వినిపిస్తోంది. తాజాగా దళపతి విజయ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ లుక్ పోస్టర్ కూడా ఆవిష్కరించారు. మూవీలో విజయ్ క్యారెక్టర్ రెండు విభిన్నమైన షేడ్స్ లో ఉంటుందనే ప్రచారం నడుస్తోంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన తెలుగు రైట్స్ కోసం ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఆసక్తికరమైన పోటీ నెలకొందని తెలుస్తోంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలు తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యాయి.
ఈ కారణంగా ప్రస్తుతం విజయ్ తో చేస్తున్న లియో సినిమాకి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. విజయ్ నుంచి చివరిగా వచ్చిన వారసుడు మూవీ కూడా తెలుగులో కమర్షియల్ సక్సెస్ అందుకుంది. ఈ ట్రెండ్స్ ని దృష్టిలో ఉంచుకొని నిర్మాత లియో సినిమాకి ఏకంగా నిర్మాత 25 కోట్లు తెలుగు రైట్స్ కోసం డిమాండ్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న మాట.
ఈ స్థాయిలో రైట్స్ అంటే కచ్చితంగా భారీ మొత్తమని చెప్పాలి. లియో సినిమా రిలీజ్ అవుతున్న దసరా టైంలోనే బాలకృష్ణ భగవంత్ కేసరి, మాస్ మహారాజ్ టైగర్ నాగేశ్వరరావు మూవీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ రెండు చిత్రాలపై భారీ అంచనాలు ఉన్నాయి. వీటికి పోటీగా లియో మూవీ రిలీజ్ చేస్తే కచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. తెలుగు సినిమాకి ఆడియన్స్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో నిర్మాత చెప్పిన 25 కోట్ల పై డిస్టిబ్యూటర్స్ ముందుకొచ్చే ఛాన్స్ ఉందా లేదా అనేది చూడాలి.


Click it and Unblock the Notifications











