Don't Miss!
- News కోనసీమ జిల్లాలో జనసేన ఖాళీ.. మరో నేత రాజీనామా
- Sports చరిత్ర సృష్టించిన ధోనీ.. ఒకే ఒక్కడు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
విజయ్ సినిమాపై 200కోట్ల పెట్టుబడి.. డబ్బులు తిరిగిచ్చేయాలని ఒత్తిడి?
కోలీవుడ్ ఇండస్ట్రీలో రజినీకాంత్ కమల్ హసన్ తరువాత ఆ స్థాయిలో చాలా స్పీడ్ గా తనకంటూ ఒక మార్కెట్ సెట్ చేసుకున్న హీరో విజయ్. సినిమా సినిమాకు తన క్రేజ్ పెంచుకుంటూ వెళుతున్న ఈ స్టార్ హీరో నెక్స్ట్ మాస్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే కరోనా పెరుగుతున్న సమయంలో ఈ స్టార్ హీరో కోసం డీలింగ్స్ సెట్ చేసుకున్న బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు డబ్బులు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
కోలీవుడ్ స్టార్ హీరో..
కోలీవుడ్ లో ఎంత మంది స్టార్ హీరోలు ఉన్నా కూడా ప్రస్తుతం అక్కడ విజయ్ హవానే ఎక్కువగా నడుస్తోంది. కరోనా వైరస్ లేకపోయి ఉంటే ఈపాటికే మాస్టర్ సినిమా సంబరాలు ఒక రేంజ్ లో కనిపించేవి. సమ్మర్ లో రిలీజ్ చేయాలని అనుకున్న చిత్ర యూనిట్ కి ఎవరు ఊహించని విధంగా లాక్ డౌన్ దెబ్బ కొట్టింది. దీంతో వాయిదా వేయక తప్పలేదు.
అప్పట్లో రావడం కష్టమే..
మాస్టర్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీలింగ్స్ గతంలోనే పూర్తయ్యాయి. ఈ సినిమాపై నిర్మాతలు 170కోట్ల పెట్టుబడి పెట్టారు. ఇక డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాపై చాలా నమ్మకం పెట్టుకున్నారు. దాదాపు 200కోట్లు కలెక్ట్ చేస్తే గాని వారు నష్టాల నుంచి బయటపడరు. భారీగా రిలీజ్ చేయాలని ముందే ప్లాన్ రెడీ చేసుకున్నారు. కానీ సినిమా ఇప్పట్లో రిలీజ్ అయ్యేలా కనిపించడం లేదు. ఎందుకంటే తమిళనాడులో కరోనా వైరస్ రోజురోజుకి మరింత తీవ్రంగా విజృంభిస్తోంది.
టాప్ 2లో..
ఇండియాలో అత్యదిక పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాలలో తమిళనాడు రెండవ స్థానంలో ఉంది. 20వేలకు పైగా కరోనా కేసులు నమోదవ్వడంతో అక్కడ ప్రభుత్వం చాలా వరకు కొన్ని ఆంక్షలు విధించింది. దీంతో సినిమా థియేటర్స్ ఇప్పట్లో ఓపెన్ అయ్యేలా కనిపించడం లేదు. ఒక వేళ ఓపెన్ అయినా కూడా జనాలు థియేటర్స్ వరకు రావడం అనుమానంగానే ఉంది.
Recommended Video
భయంతో..
దీంతో బయ్యర్లు కొందరు ఈ సినిమాపై పెట్టిన పెట్టుబడిని వెనక్కి తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నట్లు కోలీవుడ్ లో టాక్ వస్తోంది. నిర్మాతలతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని క్యాన్సిల్ చేస్తూ.. డబ్బును వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమాపై వస్తున్న రూమర్స్ కారణంగా తలపట్టుకున్న నిర్మాతలు మళ్ళీ ఇరకాటంలో పడ్డట్లు సమాచారం.