దద్దరిల్లిన విజయ్ మాస్టర్ టీజర్.. ఆ దేశాల్లో కూడా న్యూ రికార్డ్
కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఎంతమంది ఉన్నా కూడా ఇలాయదలపతి విజయ్ కి ఉన్న క్రేజ్ మాత్రం చాలా డిఫరెంట్ అనే చెప్పాలి. సౌత్ మొత్తంలో రజినీకాంత్ స్థాయిలో నెంబర్ వన్ స్థానానికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తెలుగులో కూడా విజయ్ కి ఇప్పుడిప్పుడే మార్కెట్ పెరుగుతోంది. ఇక అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న టీజర్ ని దీపావళి సందర్భంగా విడుదల చేసిన విషయం తెలిసిందే.
అసలు మ్యాటర్ లోకి వస్తే సినిమా టీజర్ ఇండియాలోనే ఒక నయా రికార్డ్ ను క్రియేట్ చేసింది. ఇప్పటికే 16మిలియన్ వ్యూవ్స్ తో 1.7M లైకులతో ట్రెండ్ సెట్ చేసిన మాస్టర్ మరికొన్ని టాప్ కంట్రీస్ లో కూడా అదే తరహాలో సందడి చేసింది. సింగపూర్, శ్రీలంకలో కూడా విజయ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందొ మరోసారి మాస్టర్ రుజువు చేసింది. అక్కడ కూడా టీజర్ నెంబర్ వన్ ట్రేండింగ్ లిస్ట్ లోకి వచ్చేసింది.

ఇక మలేషియాలో రెండవ స్థానంలో ఉండగా స్విట్జర్లాండ్ లో అయితే నెంబర్ 10లో కొనసాగుతోంది. మాస్టర్ సినిమాకు ఖైదీ దర్శకుడు లోకేష్ కనగరాజన్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అసలైతే సమ్మర్ లోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. సినిమాలో విజయ్ నెవర్ బిఫోర్ అనేలా చాలా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. అందుకే టీజర్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. టీజర్ తోనే ఒక ట్రెండ్ సెట్ చేసిన విజయ్ సినిమాతో ఇంకా ఏ స్థాయిలో ట్రెండ్ సెట్ చేస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











