twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈ ఏడాది ఉత్తమ చిత్రంగా ‘మాస్టర్’: అరుదైన రికార్డును అందుకున్న విజయ్

    |

    కోలీవుడ్‌లో వరుస విజయాలను అందుకుంటూ సత్తా చాటుతున్నాడు స్టార్ హీరో ఇళయదళపతి విజయ్. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఆరంభంలో 'మాస్టర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 'ఖైదీ' ఫేమ్ లోకేష్ కనకరాజ్ దీన్ని తెరకెక్కించాడు. ఎన్నో అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే, కలెక్షన్ల పరంగానూ ఇది దుమ్మ దులిపేసింది. దీంతో ఈ చిత్రం ఎన్నో రికార్డులను కూడా క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా 'మాస్టర్' మూవీ అరుదైన ఘనతను సొంతం చేసుకుని సత్తా చాటింది.

    'మాస్టర్' మూవీ ఇప్పటికే ఎన్నో మైలురాళ్లను చేరుకోవడంతో పాటు కొన్ని ఊహించని ఘనతలను సొంతం చేసుకుంది. అదే సమయంలో బుక్‌ మై షోలో ఎక్కువ రేటింగ్ అందుకున్న చిత్రాల జాబితాలో చోటు దక్కించుకుంది. ఇదిలా ఉండగా.. 2021 సంవత్సరానికి గానూ ఇప్పటి వరకూ విడుదలైన వాటిలో ఎక్కువ ప్రజాధరణ పొందిన చిత్రాల జాబితా విడుదలైంది. ఇందులో విజయ్ నటించిన మాస్టర్ మూవీ మొదటి స్థానంలో నిలిచింది. దీంతో ఈ స్టార్ హీరో ఖాతాలో అరుదైన రికార్డు వచ్చి చేరింది. దీని తర్వాత మోహన్ లాల్ నటించిన 'దృశ్యం 2' రెండో స్థానంలో ఉంది.

    Vijay Master Selected as Most Poular Indian Movies 2021

    ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'మాస్టర్' మూవీలో విజయ్ ప్రొఫెసర్ పాత్రలో నటించాడు. అలాగే, మరో స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్‌గా నటించాడు. వీళ్లిద్దరి మధ్య పోరును దర్శకుడు లోకేష్ అద్భుతంగా చిత్రీకరించాడు. దీంతో ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక, ఈ సినిమాను ఎక్స్‌బీ ఫిల్మ్ క్రియేటర్ బ్యానర్‌పై స్కేవియర్ బ్రిట్టో నిర్మించారు. మాలవిక మోహనన్ ఇందులో హీరోయిన్‌గా నటించింది. ఆండ్రియా కీలక పాత్రను పోషించింది.

    English summary
    Vijay Recently Done Master Movie Under Lokesh Kanagaraj Direction. In This Movie Vijay Sethupathi Played Negative Role. Now This Film Selected as Most Poular Indian Movies 2021.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X