విజయ్, మురగదాస్ కాంబో.. రెమ్యునరేషన్ వంద కోట్లా?
కోలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ హీరో కాంబినేషన్ అంటే అంచనాలు మామూలుగా ఉండవు. ఒక్క సినిమా హిట్టయిన కాకపోయినా కాంబినేషన్ కుదిరితే వరుసగా భారీ సినిమాలు వస్తూనే ఉంటాయి. ఇక తమిళ్ హీరో విజయ్ అట్లీతో వరుసగా మూడు బాక్సాఫీస్ హిట్స్ తో తన మార్కెట్ ని 300కోట్లకు పైగా పెంచుకున్నాడు. మురగదాస్ తో కూడా విజయ్ అదే రేంజ్ లో సక్సెస్ అందుకుంటున్నాడు.
నెక్స్ట్ విజయ్, మురగదాస్ కాంబినేషన్ లో మరో భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మాస్టర్ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడటంతో ఆ ప్రాజెక్టును స్టార్ట్ చేయడం లేదు. కరోనా వైరస్ తగ్గిన వెంటనే మాస్టర్ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసి తుపాకి దర్శకుడితోనే మరో సినిమాను స్టార్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దర్శకుడు. మురగదాస్ ఇప్పటికే స్క్రిప్ట్ పనులన్నీటిని పూర్తి చేసినట్లు సమాచారం. విజయ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

అయితే వీరి రెమ్యునరేషన్ కి సంబంధించిన ఒక వార్త కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరికి కలిపి దాదాపు 100కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకునే అవకాశం ఉందట. గత సినిమా రిజల్ట్ తో విజయ్ ఒక్కడే నెక్స్ట్ ప్రాజెక్టులకు 100కోట్లకు పైగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు టాక్ అయితే బాగానే వచ్చింది. అయితే కరోనా వైరస్ కారణంగా భారీగా తగ్గించినట్లు తెలుస్తోంది. ఒక 70కోట్ల వరకు అందుకొనున్నాడట. ఇక మురగదాస్ 30కోట్లకు వరకు అందుకునే ఛాన్స్ ఉందట. ఈ విధంగా ఇద్దరు కలిసి 100కోట్లకు టార్గెట్ పెట్టినట్లు టాక్.


Click it and Unblock the Notifications











