నయనతార, విజయ్‌ల యమ కంత్రీ చిత్ర వివరాలు
చాలా రోజుల తర్వాత నయనతార మళ్లీ తెలుగు ప్రేక్షకులకు కనువిందు చేయనున్నారు. తమిళనటుడు విజయ్ సరసన నయనా హీరోయిన్‌గా నటిస్తున్న "యమ కంత్రీ" చిత్రం త్వరలో విడుదల కానుంది. తమిళచిత్రం "విల్లు"ను తెలుగులోకి అనువాదం చేయనున్నారు. ఈ చిత్రానికి నయన ప్రియుడే (ప్రభుదేవా) దర్శకత్వం వహిస్తున్నారు.
జీడీఆర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ ద్వారా జీ ఉషారాణి సమర్పిణలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి సంగీతాన్ని దేవీశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. జనవరి 31న యమ కంత్రీ చిత్రం తెలుగు వెర్షన్ ఆడియో విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి రెండో వారంలో ఈ చిత్రన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











