'జిల్లా' టైటిల్ తో మాస్ మసాలా... కాజల్ హీరోయిన్
చెన్నై: తెలుగు, తమిళ భాషల్లో దూసుకుపోతున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఆమె తాజాగా తమిళంలో ఓ చిత్రం కమిటైంది. 'ఇలయ తలబది' విజయ్ సరసన ఆమె చేయనుంది. ఈ కొత్త చిత్రాన్ని మే నెలలో సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు. సూపర్‌గుడ్ ఫిలింస్ నిర్మాణంలో 'జిల్లా'లో నటించనున్నాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్. ఈ చిత్రం మాస్ మసాలా చిత్రంగా తెరకెక్కనుంది. ఈ చిత్రంతో కాజల్ తమిళంలో పూర్తిగా సెటిలవుతాననే నమ్మకం వ్యక్తం చేస్తోంది.
గత ఏడాది 'తుపాకి' ఇచ్చిన ఉత్సాహంతో ప్రస్తుతం 'దైవతిరుమగళ్' ఫేమ్ విజయ్ దర్శకత్వంలో 'తలైవా'లో నటిస్తున్నాడు. కమల్ హాసన్ మద్దతుగా 'విశ్వరూపం' విడుదల వరకు చిత్రీకరణను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. మరోవైపు విజయ్ కొత్త చిత్రానికి రంగం సిద్ధమైంది. తుపాకి చిత్రం కూల్ హిట్ అని.. వంద కోట్లు దాటినా తన మాస్ అభిమానులను అలరించాలంటే ఇలాంటి చిత్రాలను చేయాల్సిందే అంటున్నారు విజయ్.
'గుమ్కీ' విజయంలో కీలకపాత్ర పోషించిన సంగీత దర్శకుడు డి.ఇమాన్ స్వరాలు సమకూర్చనున్నాడు. నేశన్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించనున్నాడు. మే మొదటి వారంలో సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు. ప్రస్తుతం కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సూపర్‌గుడ్ ఫలింస్ కోసం విజయ్ తన పారితోషికాన్ని కొంచెం తగ్గించుకున్నాడని సమాచారం.


Click it and Unblock the Notifications











