twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బాద్‌షా' తమిళ రీమేక్ లో హీరో ఎవరు?

    By Srikanya
    |

    చెన్నై : ఎన్టీఆర్‌,శ్రీను వైట్ల కాంబినేషన్ లో రెడీ అయి మొన్న శుక్రవారం విడుదల అయిన 'బాద్‌షా' తమిళ నిర్మాతలను ఆకర్షించింది. బండ్ల గణేశ్‌ నిర్మించిన ఈ చిత్రంలో కాజల్‌ హీరోయిన్ . బ్రహ్మానందం, నాజర్‌, ఎంఎస్‌ నారాయణ తదితరులు నటించారు. తమిళంలో రీమేక్‌ హక్కులు పొందిన పీవీపీ సంస్థ కథను విజయ్‌కి వినిపించినట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

    మరో ప్రక్క అజిత్‌ కోసం ప్రత్యేక ప్రదర్శన వేసినట్లు చిత్రవర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో కోలీవుడ్‌ 'బాద్‌షా' వీరిద్దరిలో ఎవరో ఒకరు ఉండొచ్చని సమాచారం. ప్రస్తుతం 'తలైవా' చిత్రీకరణలో ఉన్న విజయ్‌ ఇది పూర్తయిన తర్వాత నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

    మరో ప్రక్క తమిళనాడులో ఈ చిత్రం స్ట్రైయిట్ వెర్షన్ భారీగానే విడుదలైంది. ఎన్టీఆర్‌ చెబుతున్న పంచ్‌ డైలాగులకు నగరంలోని నందమూరి అభిమానులు పులకిస్తున్నారు. భారీ అంచనాల నడుమ శుక్రవారం విడుదలైన 'బాద్‌షా' చెన్నైలో సందడి చేస్తోంది. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్‌తోపాటు తమిళనాడులోని చెన్నై తదితర ప్రాంతాల్లోనూ విడుదలయింది. వీకెండ్ లో కలెక్షన్స్ అదరకొట్టినట్లు చెప్తున్నారు.

    ఈ సందర్భంగా నగరంలోని క్యాసినో థియేటర్‌ వద్ద సందడి నెలకొంది. ప్రేక్షకులు ఉదయం నుంచే టిక్కెట్ల కోసం కౌంటర్‌ వద్ద బారులు తీరారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ అభిమానులు భారీ బ్యానర్లు పెట్టి వాటికి పాలాభిషేకం, పుష్పాభిషేకంతో సందడి చేశారు. టపాకాయలు పేల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. టిక్కెట్ల కోసం ప్రేక్షకుల మధ్య చిన్నపాటి తొక్కిసలాట చోటుచేసుకోవటంతో పోలీసులు వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు.

    English summary
    
 Latest Telugu Block Buster Baadshah is set to be remade in Tamil. Southern Star Ilayathalapathy Vijay is busy shooting for Thalaivaa in Australia under A.L.Vijay’s direction, may play the main lead in Tamil remake of Baadshah. Prasad V Potluri has bagged the remake rights of this film. Official announcement on this movie is awaited.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X