సర్కార్ చిత్రంలో ముఖ్యమంత్రి పాత్రలో విజయ్!
తమిళ సూపర్‌స్టార్ విజయ్ నటించిన సర్కార్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దీపావళికి రిలీజ్ అవుతున్నది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సామాజిక, రాజకీయ చిత్రంగా రూపొందుతున్నది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది.
సర్కార్ చిత్రంలో విజయ్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తారట. సీఎం పాత్రలో నటించడం విజయ్ కెరీర్‌లో ఇదే తొలిసారి. ముఖ్యమంత్రి పాత్రను చాలా ప్రభావవంతంగా తీర్చిదిద్దారట.

ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రను రాధా రవి పోషిస్తున్నారు. రాధా రవి, విజయ్ పాత్ర మధ్య వచ్చే సీన్లు రచ్చ రచ్చగా ఉంటాయనేది చిత్ర యూనిట్ సమాచారం.
సర్కార్ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించింది. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకొంటున్నది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్నది. మ్యూజిక్ మాంత్రికుడు ఏఆర్ రెహ్మన్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











