సౌత్ బిగెస్ట్ బాక్సాఫీస్ ఫైట్.. రజనీకాంత్ తో పోటీకి సిద్దమైన విజయ్!
కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఎంతమంది ఉన్నా కూడా మొదట ఎక్కువ మందికి గుర్తొచ్చే పేరు సూపర్ స్టార్ రజనీకాంత్. ఇక చాలా కాలం వరకు ఆ బ్రండ్ ను అలా మెయింటైన్ చేస్తూ వచ్చిన తైలవాకు ఈ మధ్య వరుస అపజయాలు ఎదురవుతున్న విషయం తెలిసిందే. ఎలాంటి సినిమా చేసినా కూడా గతంలో మాదిరిగా హిట్ అవ్వడం లేదు.
నిజానికి రజనీకాంత్ రోబో సినిమా తరువాత మళ్ళీ ఆ స్థాయిలో హిట్టు మాత్రం కొట్టలేదు. చివరగా వచ్చిన పేట, దర్బార్ తెలుగులో కూడా ప్లాప్ అయ్యాయి. ఇక ఇప్పుడు అన్నత్తే సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద మళ్ళీ తన సత్తా చాటాలని సూపర్ స్టార్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు గాని పోటీగా మాత్రం దళపతి విజయ్ సినిమా రానున్నట్లు కోలీవుడ్ మీడియాలో టాక్ గట్టిగానే వస్తోంది.

రజనీకాంత్ మార్కెట్ ను మించి బాక్సాఫీస్ హిట్స్ కొడుతున్నాడు విజయ్. మాస్టర్ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినా కూడా 200కోట్ల వసూళ్లతో సరికొత్త సంచలనం క్రియేట్ చేసింది. ఇక రజనీకాంత్ అన్నత్తే దీపావళికి రానుండగా అదే సమయంలో విజయ్ తన 65వ సినిమాను కూడా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ స్టార్ హీరోస్ ఇద్దరు ఓకేసారి వస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద పోటాపోటీగా సరికొత్త రికార్డులు క్రియేట్ అవ్వడం పక్కా. చూడాలి మరి ఏం జరుగుతుందో..


Click it and Unblock the Notifications











