పొలిటికల్ పార్టీ ఏర్పాటుపై స్పందించిన విజయ్.. రాజకీయ ప్రవేశంపై క్లారిటీ..
తమిళ సూపర్ స్టార్ విజయ్ భారత ఎన్నికల సంఘంలో తన రాజకీయ పార్టీని నమోదు చేసుకోబోతున్నారనే వార్త మీడియాలో హల్‌చల్ రేపింది. దాంతో అభిమానులు ఉత్సాహంలో మునిగిపోతే.. రాజకీయ వర్గాల్లో ఈ వార్త కలకలం రేపింది. అయితే తన రాజకీయ ప్రవేశం, పార్టీ ఏర్పాటు గురించి మీడియాలో వస్తున్న వార్తలపై ఆయన సోషల్ మీడియాలో ఓ ప్రకటన చేశారు. ఆయన రిలీజ్ చేసిన ప్రకటన ఏమిటంటే..

రాజకీయ పార్టీ పేరు నమోదుపై
గత కొద్దికాలంగా తన సినిమాల్లో రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలపై విమర్శలు చేస్తున్న విజయ్ పార్టీ పెట్టబోతున్నట్టు ఏడాదిగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఎన్నికల సంఘంలో ఆల్ ఇండియా విజయ్ మక్కల్ ఇయాక్కమ్ అనే పార్టీని నమోదు చేశారనే వార్త గుప్పుమన్నది. అయితే ఆ పార్టీని నమోదు చేసుకొన్నది విజయ్ కాదు.. ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ అనే వార్త వెలుగులోకి వచ్చింది.

నా తండ్రి స్థాపించిన పార్టీతో
రాజకీయ పార్టీ ఏర్పాటుపై వస్తున్న వార్తలపై విజయ్ స్పందిస్తూ.. మీడియాలో నా తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే నా ఫ్యాన్స్‌కు తెలియజేసేది ఏమిటంటే.. అలాంటి పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు అని స్పష్టం చేశాడు.

రాజకీయాలకు సంబంధించి...
భవిష్యత్‌లో రాజకీయాలతో సంబంధించి ఎలాంటి పరిణామాలు చోటుచేసుకొన్నా వాటితో నాకు సంబంధం ఉండదు. అలాంటి పరిణామాలకు నేను దూరంగా ఉంటాను. నా తండ్రి స్థాపించారని చెప్పి ఆ పార్టీలో ఎట్టి పరిస్థితుల్లో చేరవద్దని నేను కోరుతున్నాను. వాటికి సాధ్యమైనంత మేరకు దూరంగా ఉండాలని అభిమానులను కోరుతున్నాను అని విజయ్ తెలిపారు.

నా తండ్రి పార్టీతో ఎలాంటి సంబంధం లేదు
నా తండ్రి ఏర్పాటు చేసే పార్టీతో మనకు ఎలాంటి సంబంధం లేదు. వారి ఎజెండా, కార్యకలాపాలతో లింకులు ఉండబోవు. ఒకవేళ విజచయ్ మక్కల్ ఇయక్కామ్ పార్టీ వర్గాలు నా పేరును గానీ, ఫొటోను గానీ ఆ పార్టీకి ఉపయోగించుకొని దుర్వినియోగం చేస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకొంటాను. సంబంధించిన వార్తల్లో వాస్తవం లేదు అంటూ ఆయన సన్నిహితులు పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











