స్టార్ హీరో కారు పక్కనే ప్రమాదకరంగా అభిమాని.. విండో దించి ఏంచెప్పాడో తెలుసా!
ఇళయ దళపతి విజయ్ నటిస్తున్న చిత్రాలు బాక్సాఫీస్ దూసుకుపోతున్నాయి. వరుస విజయాలతో విజయ్ క్రేజ్ రోజు రోజుకు పెరుగుతోంది. గత ఏడాది విడుదలైన సర్కార్ చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. కత్తి, తుపాకీ, తేరి, మెర్సల్, సర్కార్ ఇలా బ్లాక్ బస్టర్ విజయాలతో విజయ్ తమిళంలో తిరుగులేని హీరోగా మారిపోయాడు. విజయ్ అంటే పిచ్చెక్కి పోయే అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలో తరచుగా విజయ్ ఫ్యాన్స్ కు ఇతర హీరోల ఫ్యాన్స్ కు మధ్య జరుగుతున్న ట్రోలింగ్ చూస్తూనే ఉన్నాం. పలు సందర్భాల్లో విజయ్ అభిమానులే అతనికి ఇబ్బంది కరంగా మారుతున్నారు. తాజగా అలాంటి ఘటనే జరిగింది.

అట్లీ దర్శత్వంలో
ప్రస్తుతం విజయ్ అట్లీ దర్శత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఫుట్ బాల్ క్రీడ నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. విజయ్ ఫుట్ బాల్ కోచ్ గా కనిపిస్తాడట. క్రీడారంగంలో ఉండే రాజకీయాలపై అట్లీ ఈ చిత్రంతో బాణం సంధించబోతున్నట్లు తెలుస్తోంది. మెర్సల్ చిత్రంలో ఇండియాలో ఉన్న వైద్యరంగంలో లొసుగులని చూపించారు.

షూటింగ్ ముగించుకుని
విజయ్ ఇటీవల చెన్నైలోని ఓ కాలేజీకి షూటింగ్ కోసం వెళ్ళాడు. షూటింగ్ ముగించుకుని వస్తుండగా విజయ్ కారుని ఆయన అభిమానులు కొందరు వెంబడించారు. తలైవా.. తలైవా అని నినాదాలు చేస్తూ వేగంగా బైకులలో వెళ్లారు. విజయ్ కారు కూడా వేగంగా వెళుతోంది. కొందరు అభిమానులైతే విజయ్ కారు పక్కనే బైక్ నడుపుతూ చాలా ప్రమాదకరంగా కనిపించారు. దీనిని విజయ్ గమనించి కారు అద్దాన్ని కిందికి దించాడు.
భయపడిన విజయ్
కారు పక్కనే అభిమానులు బైక్స్ వస్తున్న వేగానికి విజయ్ కూడా టెన్షన్ పడ్డాడు. నన్ను వెంబడించవద్దు అంటూ అభిమానులు చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విజయ్ తన అభిమానుల రక్షణ కోసం ఆలోచించడని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అభిమానుల వలన విజయ్ ఇబ్బంది పడడం ఇది మొదటి సారి కాదు.

వివాహ వేడుకలో
గత ఏడాది విజయ్ తన అభిమాన సంఘం నాయకుడి కుమార్తె వివాహానికి హాజరయ్యాడు. విజయ్ వస్తున్నాడని తెలియడంతో అభిమానులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. విజయ్ కారు దిగి కల్యాణ మండపంకు చేరుకునే సమయంలో అభిమానుల తోపులాట జరిగింది. ఫాన్స్ అంతా ఒక్కసారి విజయ్ ని చుట్టుముట్టడంతో కిందపడిపోయాడు. విజయ్ కి స్వల్ప గాయాలు కూడా అయ్యాయి.


Click it and Unblock the Notifications











