Vijay's Beast Trailer Review: పొలిటిషియన్‌ని కాదు.. సైనికుడిని.. హై ఇంటెన్సిటీతో హైజాక్ డ్రామా‌గా బీస్ట్

తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన బీస్ట్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు ముస్తాబవుతున్నది. కరోనావైరస్ లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ పలుమార్లు వాయిదా పడటంతో ఇళయ దళపతి అభిమానులు నిరాశకు లోనై ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను ఉగాది పండుగ రోజున అభిమానులకు అందించారు. కిడ్నాప్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ ఎలా ఉందంటే..

 ఈస్ట్ కోస్ట్ మాల్‌లో హైజాక్ అంటూ

ఈస్ట్ కోస్ట్ మాల్‌లో హైజాక్ అంటూ

అర్ధరాత్రి 10.30 గంటలకు ఫోన్ కాల్‌తో లేవాల్సి వచ్చింది. మిస్టర్ మాధవ్ సింగ్ మీకు తెలియజేయాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ మాల్‌లో హైజాక్ జరిగింది. చాలా మందిని టెర్రిరిస్టులు బంధించారు అని ఓ వాయిస్ చెప్పగానే.. మాల్‌లో టెర్రిరిస్టులు భీభత్సం సృష్టించడం ట్రైలర్‌లో కనిపించింది. విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ అందరికి భయోత్పాతాన్ని రుచి చూపించారు.

బందీలు.. ఉగ్రవాదులు.. అధికారుల హైడ్రామా

బందీలు.. ఉగ్రవాదులు.. అధికారుల హైడ్రామా


ఈస్ట్ కోస్ట్ మాల్‌లో బందీలు ఒకవైపు.. మరో వైపు ప్రభుత్వ అధికారులతో ఉగ్రవాదుల చర్చలు మరింత టెన్షన్‌కు గురిచేసేలా ట్రైలర్‌లో జొప్పించారు. ఇలాంటి పరిస్థితుల్లో సెల్వ రాఘవన్ ఎంట్రీ ఆసక్తికరంగా కనిపించింది. గట్టిగా ఊపిరి పీల్చితే పడిపోయేలా ఉంది.. ఇంతకంటే పాత బిల్డింగ్ దొరకలేదా అంటూ తన సిబ్బందిని ప్రశ్నిస్తూ తనదైన మార్క్‌లో ఎంట్రీ ఇచ్చాడు. మొత్తానికి హైజాక్ డ్రామా మొత్తాన్ని ట్రైలర్‌లో చెప్పడానికి ప్రయత్నాన్ని యూనిట్ చేసింది.

వీర రాఘవుడి ప్రతాపం

వీర రాఘవుడి ప్రతాపం


చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ మాల్‌లో జరిగిన హైజాక్ ఘటన ఓ బ్యాడ్ అయితే.. ఇందులో గుడ్ కూడా ఉంది. హైజాక్‌కు గురైన వారిలో మన స్టాఫ్ కూడా ఓ అబ్బాయి కూడా ఉన్నారంటూ చెప్పడం, ఆ తర్వాత విజయ్ ఎంట్రీ కూడా సిట్యుయేషన్‌కు తగినట్టుగా అదిరిపోయింది. నేను అబ్బాయి అని అంటే అతడిని తక్కువగా అంచనా వేయకు. అతడు మనకు ఉన్న గూఢచారుల్లో ది బెస్ట్. అతడే వీర రాఘవన్.. అలాంటి వ్యక్తి ఉన్న మాల్‌ను హైజాక్ చేశారంటే.. వాళ్ల పరిస్థితి ఏమిటో ఊహించుకో.. ఇక వీర రాఘవన్ దూకుడికి టెర్రిరిస్టులు ప్రాణాలు చేతిలో పట్టుకొని పారిపోవాల్సిందే. వీర రాఘవుడి తాకిడికి స్క్రీన్లకు మంటలు పెట్టాల్సిందే. పటాసులు భారీగా పేలాల్సిందే అనే డైలాగ్స్ ఫ్యాన్స్‌కు పండుగ వాతావరణం కల్పించేలా ఉన్నాయి.

 విజయ్ ఫెర్ఫార్మెన్స్ అదుర్స్

విజయ్ ఫెర్ఫార్మెన్స్ అదుర్స్


ఉగ్రవాదులను వెంటాడిన తీరు.. వారిని పరుగులు పెట్టించి విధానం.. బాంబులు.. తుపాకులు, అలాగే కత్తులతో చీల్చి చెండాడిన విధానం గురించి వీర రాఘవన్ పక్కనే ఉన్న వ్యక్తితో మాట్లాడుతూ.. నీవు భయపడ్డావా అడిగిన తీరు మాస్ ఆడియెన్స్ కిక్ ఎక్కించేలా ఉంది. ఇక ముందు ఇంతకంటే వరస్ట్‌గా ఉంటుంది. ఇక హైజాక్ విషయంలో అధికారులకు, రాజకీయ నేతలకు మధ్య వాగ్వాదం హై ఇంటెన్సిటిని క్రియేట్ చేసింది. విజయ్ యాక్షన్ ఎపిసోడ్స్, మిలిటరీ బ్యాక్ డ్రాప్ సన్నివేశాలు అభిమానులకు ఫీస్ట్‌గా మారే అవకాశం ఉంది.

 దేశభక్తితో కూడిన హైజాక్ డ్రామాగా

దేశభక్తితో కూడిన హైజాక్ డ్రామాగా


ఇక ట్రైలర్‌లో వీర రాఘవన్‌గా విజయ్ ఫెర్ఫార్మెన్స్ అతడి టాలెంట్‌కు మచ్చు తునకలా కనిపించింది. నేను రాజకీయ నేతను కాను. నేను సైనికుడిని అంటూ చెప్పిన డైలాగ్స్ పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఇక సరిహద్దులో యుద్ద విమానాలను డ్రైవ్ చేస్తూ లాంచ్ అంటూ బాంబులను కురిపించిన తీరు సినిమాలో యాక్షన్ ఎలా ఉంటుందో ఓ శాంపిల్‌గా చూపించారు. మొత్తానికి బీస్ట్ సినిమా దేశభక్తితో కూడిన హైజాక్ డ్రామాను అందించబోతున్నట్టు ట్రైలర్‌లో చిత్ర యూనిట్ వెల్లడించింది.

బీస్ట్‌లో నటీనటులు, సాంకేతిక నిపుణులు

బీస్ట్‌లో నటీనటులు, సాంకేతిక నిపుణులు

నటీనటులు: విజయ్, పూజా హెగ్డే, సెల్వ రాఘవన్, యోగిబాబు, రెడిన్ కింగ్స్‌లే తదితరులు
రచన, దర్శకత్వం: నెల్సన్
నిర్మాణం: సన్ పిక్చర్స్
మ్యూజిక్: అనిరుధ్
డీవోపీ: మనోజ్ పరమహంస
ఎడిటింగ్: R నిర్మల్
ఆర్ట్: డీఆర్‌కే కిరణ్
యాక్షన్: అంబరివ్
కొరియోగ్రఫి: జాని, గోపి ప్రసన్న

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X