లంకలో విజల్ మోత... రీ-రిలీజ్ అయిన విజయ్ సినిమా...
ఇళయదళపతి విజయ్ లాక్ డౌన్ లోనూ థియేటర్లను విజిల్స్ తో మోతెక్కించేస్తున్నాడట. దేశవ్యాప్తంగా థియేటర్లపై నిషేధం ఉండగా, ఇదేలా సాధ్యం అనుకుంటున్నారా? విజయ్ మోతెక్కిస్తున్నది ఇక్కడ కాదు మరి. శ్రీలంకలో విజయ్ విజిల్ సినిమా రీ-రిలీజ్ అయ్యి జనాలను మరోసారి రంజింపజేస్తోంది.
కరోనా వైరస్ వల్ల మూతపడిన థియేటర్లకు జనాలను రప్పించేందుకు శ్రీలంకలోని థియేటర్ల ఓనర్లు, తమిళ స్టార్ హీరోల సినిమాలను ఒక దాని తరువాత మరొకటి రిలీజ్ చేయాలని భావిస్తున్నారట.
ఇందులో భాగంగానే సూపర్ హిట్ అయిన విజయ్ విజిల్ సినిమాతో మొదలుపెట్టారని తెలుస్తోంది.
ఆ మధ్య జర్మనీ, ఫ్రాన్స్ లోనూ కూడా విజిల్ రీ-రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మరోవైపు విజిల్ తో పాటూ, విజయ్ ఇతర హిట్ చిత్రాలు మేర్సల్, సర్కార్ చిత్రాలను కూడా ప్రదర్శిస్తున్నారు మలేసియాలోని థియేటర్ల ఓనర్లు. దీంతో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న విజయ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారనే చెప్పాలి.

మరోవైపు విజయ్ మాస్టర్ సినిమా కోసమూ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 9నే జనాల ముందుకు రావాల్సిన చిత్రం, కరోనా వల్ల వాయిదా పడింది. అయితే ఫిల్మ్ మేకర్లు మాత్రం మాస్టర్ ను థియేటర్లోనే విడుదల చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. మరి, ఈ కరోనా సద్దుమణిగేదెప్పడో, మాస్టర్ రిలీజ్ అయ్యేదెప్పుడో చూడాలి.


Click it and Unblock the Notifications











